తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ఇవాళ తెలుగు సాహిత్య పరిధి విస్తృతమైంది. ఎవ రికివారు తమ సొంత మూలాన్ని వెతుక్కుం టున్నారు. మూలాలలోని గుణ, దోషాలను స్మరిం చుకుండా కవిత్వం రాయడమనేది కవికి అసహజ మైన విషయం అయిపోయింది. ఇలాంటి సంద ర్భాలలోనే ముస్లింవాద కవిత్వం చారిత్రక పరిణా మంలో భాగంగా మొదలయ్యింది. ఈ కవిత్వం ఏ వర్గానికో మదే సెక్యులర్‌ కవిత్వ శిబిరానికో వ్యతి రేకం కాదు, ఇది ఆలోచనాత్మకమైనది.కారంచేడు, చుండూరు, నీరుకొండ తదితర ప్రాంతాల్లో జరిగి న దళితుల ఊచకోత, నిత్యం దళిత స్త్రీలపై జరిగే అత్యాచారాలు, తరతరాల అవమానాలు దళిత కవిత్వాన్ని ఓ ఉప్పెనలా లేపాయి. ఇదే తరహాలో ముస్లింవాద కవిత్వం కూడా పెనుతుఫాన్‌లా దూ సుకొచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత, అడుగడు గునా ఎదుర్కోంటున్న వివక్షత, అభద్రతా భావం ముస్లిం సమాజాన్ని ఆలోచనలో పడేసింది. ఇలాం టి పరిస్థితులలో తప్పనిసరి అవసరంగా ముస్లిం వాద కవిత్వం తన ఆవేదననను, ఆగ్రహాన్ని, దారి ద్య్రాన్ని, దర్భలత్వాన్ని ఆవిష్కరించింది. దేశవ్యా ప్తంగా ఉన్న ఉర్దూ లేదా ఇతర భాషల కవులకన్నా తెలుగు ముస్లిం కవులు తార్కికంగా ముందున్నా రు. ఇప్పటి వరకు గజల్స్‌ ప్రవాహంలోనో, గజి బిజి ఫిలాసఫీల్లోనూ ఊయలలుగుతున్న ఇతర భాషలకు చెందిన ముస్లిం వుల్ని తెలుగు ముస్లిం కవులు పునరాలోచనలో పడేశారని చెప్పవచ్చు. కవిత్వమనేది దార్శనికత, భూత, భవిష్యత్‌, వర్త మానాల్ని అనుసంధానిస్తూ కవి ఆయా సమాజా లలో నిగూఢమైన అంతర్‌ సంఘర్షణకు అద్ధంలా నిలబడతాడు. నూతన దిశానిర్ధేశం చేస్తాడు. తు ఫాన్‌ ముందరి ప్రశాంతతలోని ప్రమాదాన్ని ది క్సూచిలా సూచిస్తాడు. దీన్ని అన్ని సమాజాలు పర స్పరం ప్రజాస్వామ్యబద్దంగా పరిశీలించాలి. రా జ్యం కూడా గుర్తెరగాలి. లేకుంటే విభిన్న సమా జాల మధ్య పెనుసంఘర్షణ ప్రారంభమౌతుంది.

ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు మాత్రమే దళితు లు కాదు, దశాబ్దాలుగా ఆర్థికంగా, సామాజి కంగా, రాజకీయంగా అణిచివేయబడిన ముస్లిం లు కూడా దళితులే. ముస్లిం సమాజానికి కొన్ని ప్రత్యేకమైన అదనపు సమస్యలున్నాయి. ముస్లిం వాద కవులు ఇ అదనపు సమస్యల్ని ఆవిష్కరించా రు.అయితే ఆలోచనావిధానంలోనూ సమస్యల విష యంలోనూ సారూప్య స్థితిని కలిగివున్న అట్టడుగు వర్గాలతో చేయి కలిపి, పీడకవర్గాలేవో, పీడిత వర్గాలేవో తేల్చుకోని మిగిలిన అన్ని ప్రజా స్వామ్య, సెక్యులార్‌ శిబిరాలను కలుపుకుంటూ నిత్యం విధానాలను పునస్సమీక్షించుకుంటూ ఒక గొప్ప ఐక్యవేదికను నిర్మించడంలో ముస్లింవాద సాహిత్యకారులు చారిత్రక భాద్యతను నెరపవలస ిన సంధర్భం ఇది. ఇవాళ ముస్లిం సమాజం ఓ భ యానకమైన స్థితిలో వుంది. తీవ్రమైన ఒడుదుడు కులతో నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతుంది. విస్తరి స్తున్న గుజరాత్‌ విషపు పొదల  ఉచ్చులో బిగుసు కుపోతున్నది. ఇలాంటి పరిస్థితులలో ముస్లిం సాహిత్యకారులు సొంతమూలాన్ని వెతుక్కుంటూ, ముస్లింల ఉనికిని సవాల్‌ చేస్తున్న శక్తులకు దీటు గా నిలబడే స్థైర్యాన్ని సమాజంలో ప్రోది చేస్తూ ఒక ప్రధాన భూమికను నిర్వర్తించాల్సి ఉంది. ము న్ముందు నిర్వర్తిస్తారని ఆశిద్దాం.

-షేక్‌ కరీముల్లా

ముస్లింల వేదన ప్రతిబింబమే ముస్లిం సాహిత్యం

కొందరు అభిప్రాయపడ్తున్నట్లుగా, గుర్తిస్తున్న ట్లుగా, చెవులు కొరుక్కుంటున్నట్లుగా ముస్లిం సా హిత్యం మతవాసన వెయ్యటంలేదు, మతోన్మా దాన్ని వ్యక్తం చెయ్యటంలేదు. కేవలం కాషాయ మూకలకు వ్యతిరేకంగాను, ఫాసిస్టూ ధోదణులకు వ్యతిరేకంగా లేస్తున్న సాహిత్యోద్యమం కాదు. ము స్లింల గాయాల అభివ్యక్తి, అవేదన, కొందరి లెక్క ల్లో దేశద్రోహులుగా తప్పుడు ప్రచారం చెయ్యబ డుతున్న బాధ ముస్లిం సాహిత్యంలో వ్యక్తమవు తున్నది. మైనారిటీవాదం అంటే ముస్లింలు, క్రిస్టి యన్లు, సిక్కులు, జైనులు, బౌద్దులు మొదలైన మతపరంగా అల్పసంఖ్యలోవున్న వాళ్లందరూ ఉండాలి. కాని వాళ్లెవరు యీ అభివ్యక్తిలో లేరు. క్రిస్టియన్లు లేకపోవడం అశ్చర్యంగానే ఉంటుంది. ఎందుంటే ముస్లింల తర్వాత క్రిస్టియన్లే అధికం గా వున్నారు కదా. ఈ ప్రజలు ఇక్కడివాళ్లే. మాట్లాడే భాషలు ఇక్కడివే అయీనా వాళ్ల పదభా వజాలంలో కొంత విలక్షణత కన్పిస్తుంది. మైనారి టీవాదంలో క్రిస్టియన్ల వేదన కొంతవరకు దళిత వాద కవిత్వంలో ప్రకటితమౌతుంది. ఇక కేవలం ముస్లింల ‘వేదన’ను ప్రకటించేదే మైనారిటీవా దంగా కన్పింస్తుంది. మైనారిటీవాదంలో ముస్లింల గాయాల అభివ్యక్తి వుంది కాని అది కొందరు అబి óప్రాయ పడ్తున్నట్లుగా,గుర్తిస్తున్నట్లుగా మతవాసన వెయ్యటంలేదు. మతోన్మాదాన్ని వ్యక్తం చెయ్యటం లేదు. భారతదేశపు విశాలమైన దేశీయ సమా జంలో భాగంగా గుర్తింపబడకపోవడం అనే ఆవే  దన, అందరిచేత కాకున్న కొందరి లెక్కల్లో దేశద్రో హులుగా తప్పుడు ప్రచారం చేయబడుతున్న భాద మైనారిటీవాదంలోని ముస్లిం సాహిత్యంలో వ్యక్త మౌతున్నది. మరికొందరు పరిగణిస్తున్నట్లుగా మైనారిటీవాదం కేవలం కాషాయమూకలకు వ్యతి రేఖంగాను, ఫాసిస్టు ధోరనులకు వ్యతిరేకంగా లేస్తున్న సాహిత్యోద్యమం కాదు.కాని మతోన్మాద శక్తులు చూపే వివక్ష అంటగట్టే దేశద్రోహత్వం జరిపే హింసకు కుమిలిపోతూ బయటకి వ్యక్తం చేసే వేదన మైనారిటీ కవిత్వంలో కన్పిస్తుంది. తమ మీద జరిగే ఆరోపణలకు నిరసన తెలుపుతు న్నది. కాని దుర్మార్గాలను ఎదిరిస్తూ తుపాకి పట్టే ప్రతీకార చర్యను పురికొల్పడం లేదు మైనారిటీ కవిత్వం మైనారిటీ కవిత్వం. మతోన్మాదం నేర్ప డం లేదు. ”ఈ గడ్డమీద పుట్టి/ఈ గడ్డ మీదె పెరి గి ఇంత జరిగినాక ఎక్కడికెళ్లిపోవాల? యాడ దాంకోవాల? యాడ సావాల?” అన్నదే మైనారిటీ కవి ఆవేదన. ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగి న వ్యక్తిని నీ పుట్టుక ఏమిటో తేల్చుకో అని ప్రశ్మిం చినప్పుడు ఆ వ్యక్తిలో ఉత్తుంగంగా లేచే ఆక్రోశమే మైనారిటీ వాదంలో కన్పిస్తుంది. కని ప్రతీకారేచ్చ కాదు. తరతరాలుగా ఎన్ని పదులు ఎన్ని వందల యేండ్లు మేము వేరే -మీరు వేరే కాదు అని నిరూ పించూకోవాల్సిన అగ్నిపరీక్షలకు గరయ్యే మూగ వేదన బద్దలై శబ్దరూపంగా వ్యక్తమవుతున్నదే మైనారిటీ కవిత్వం. ”అనుమానంలోంచి నమ్మకం లోకి తెరచుకునే మైనారిటీ కవిత్వం. ఎక్కన్నుంచి మొదలవుతుందో తెలీదు.” అంటాడు మైనారిటీ కవి ‘ నీ ఆనవాళ్లు ఏమిటి? నీ గుర్తింపు కార్డు ఏది?’ అని ప్రశ్నించిబడ్తున్న ముస్లింల అనుభవా లను అనుభూతులను వ్యక్తపరిచేదే మైనారిటీ ముస్లిం కవిత్వం. మానవీయతను మానవతావా దాన్ని ఆకాంక్షిస్తున్నదే మైనారిటీవాదం ”నన్ను బందించండి మనిషినవుతాను నన్ను కాస్తా తలె త్తనివ్వండి రేపటికి సమాధానాన్నవుతాను” అం టూన్నాడు ఇవాల్టి ముస్లిం కవి.

-ముదిగంటి సుజాతారెడ్డి

కవిత్వాన్ని తేజోవంతం చేసిన ముస్లిం స్త్రీవాదం

మైనారిటీ మెజారిటీ అనే పదాలు రామ జన్మ భూమి బాబ్రీ మసీదులంత వివాదాస్పద మైనవి. ప్రస్తుతం వాటి జోలికి వెల్లడం లేదు. మైనారిటీ స్త్రీలు అని పిలవడం కన్నా ముస్లిం స్త్రీలు, ముస్లిం స్త్రీవాద కవిత్వం అని సంబోదించడం సమంజస మని భావిస్తారు. వాళ్లు తమని ముస్లిం వాదులు గా గుర్తించండని డిమాండ్‌ చేస్తున్నారు. ముస్లిం వాద కవిత్వం తెలుగు సాహిత్యంలో పెద్ద సంచ లనం లేపింది. హిందూ కుల వ్యవస్థ మీద దళితు లు ఏ తిరుగుబాటు చేసారో దాదాపు అదే స్థాయి లో ముస్లిం కవులు హిందువులు తమని శత్రువు లుగా ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే వివక్ష మీద ఎదురు తిరిగారు. మేమూ ఈ దేశంలో భాగ మే మా రక్తంలో గంగా, యమునలు ప్రవాహిస్తు న్నాయన్నారు. ‘మా సారే జహా సే అచ్చా’ ను విడి చి పోమ్మంటే మేము సహించమని ఎంత ఎలుగెత్తి చాటినా ఒక అపనమ్మకం హిందూ ముస్లింల మధ్య అనుమానాల్ని అభద్రతనీ నానాటీకి పెంచు తూనే ఉంది. ముస్లిం స్త్రీల గురించి కవయిత్రుల కంటే ముందే కవులు రాయడం ఒక ప్రత్యేకత. ముస్లిం కవులే కాదు. ప్రాచీన సాహిత్యంలో గో ల్కోండ కవుల కావ్యాల్లొ వీళ్ల ప్రస్తావన కనబడు తుంది. ‘వసు చరిత్ర’కారుడు రామరాజు భూష ణుడు బీబీలుగా పేర్కోనడం గమనించాలి. అయి తే ఎవరి ప్రజల గురించి వాళ్లే బాగా రాయగల రనడానికి ముస్లిం కవుల్ని మొదట చెప్పుకోవాలి. ‘జల్‌జలా’ ముస్లింవాద కవిత్వంలో ఈ వాదం బలం పుంజుకుంది. గత రెండు మూడు సంవత్స రాల నుంచే ము స్లిం స్త్రీలు కవిత్వం రాస్తున్నారు. నిజానికి 1992 లోనే శ్రీమతిఇ రజియా బేగం అనే కవయిత్రి ‘అలాగే అన్నారు’ అనే మంచి కవి త రాసింది. 1993లో వచ్చిన ‘నీలి మేఘాలు’ తొలి స్త్రీవాద కవితా సంకలనంలో ఈ కవిత చో టు చేసుకుంది. అందులో ఉన్న ఏకైక ముస్లిం కవ యిత్రి రజియా బేగం. ఆమె తర్వాత మహెజబీన్‌ ‘కవితాకాశంలో అదృష్టాన్ని పరీక్షించుకూంటూ’ పాదం మోపింది. అయితే ఈమెది విప్లవ కవితా దృక్పతం. ముస్లిం స్త్రీ పుట్టుక ముస్లిం ఉనికిని నిర్ధారిస్తుంది. ఏ వర ్గపు స్త్రీనైనా రెండు శక్తులు దారుణంగా కట్టడి చేస్తాయి. ఒకటి మతం రెండు పురుషాధిపత్యం అణచివేత విషయంలో ఓ నిజం గుర్తించాలి.

-వేముల ఎల్లయ్య,స్కైబాబ

ఇంకావుంది…