తెలంగాణ రైతుకు కెసిఆర్ భరోసా
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల వ్యవసాయరంగం కుదుట పడుతున్నది. ఈ మేరకు ప్రతి సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. రైతులు ప్రయోజనం పొందుతున్నారు. తెలంగాణ రైతుల సమస్యలను అర్థం చేసుకున్న సిఎం ఒక్కో పథకాన్‌ఇన ముందుకు తసీఉకుని వస్తున్నారు. అన్నదాతలకు అండగా ఉంటున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరో బాధ్యత భుజానికి ఎత్తుకుంటున్నది. ఇప్పటికే పెట్టుబడి సాయంతో దేశంలో నంబరన్‌వన్ గా నిలిచిన ప్రభుత్వం వారికి బీమా పథకాన్ని కూడా తేనుంది. ఆరుగాలం శ్రమించే రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే.. ఆయన కుటుం బం దిక్కులేనిదవుతున్న నేపథ్యంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఐదు లక్షల ఉచిత జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేయ బోతున్నారు. వచ్చే జూన్ నుంచే దానిని అమల్లోకి తసీఉకుని రావడం ద్వారా ఇక రైతులకు సంపూర్థ భరోసా దక్కనుంది. ఈ పథకానికి మార్గదర్శకాలు రూపొందించే విషయంపై సవిూక్షించిన సిఎం మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించేలా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే పథకం యావత్తు దేశానికి మార్గదర్శం గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఎల్‌ఐసీ అధికారులతో క్షుణ్ణంగా చర్చించి, బీమా చెల్లింపులతో పాటు ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వ్యవసాయదారుడి కుటుంబానికి బాసటగా నిలిచేలా బీమా పథకం ఉండాలన్నారు. రైతుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయకుండా ఉచితంగానే రైతులకు బీమా అందించాలని సంకల్పిం చారు. భవిష్యత్‌లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ రైతు జీవిత బీమా పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఇది చిరకాలం వర్ధిల్లే పథకం. కారణం ఏదైనప్పటికీ రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి తప్పకుండా తక్షణమే రూ.5 లక్షల బీమా సొమ్ము అందించాలి. ఈ పథకాన్ని అమలుచేయడానికి ఎలాంటి సహాయమైనా చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ పథకానికి చెల్లించే ప్రీమియంను బడ్జెట్‌లో కేటాయించి చెల్లింపు హావిూ ఇస్తాం అని సీఎం తెలిపారు.
వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడానికి రైతు బంధు, రైతు బీమా వంటి వినూత్న పథకాలను తీసుకొచ్చారు. ఏ కారణం వల్లనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిది కావద్దనే ఉద్దేశంతోనే జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించాం అని సీఎం చెప్పారు. చిన్న, సన్నకారు పెద్ద రైతులు అనే తేడా లేకుండా ఎవరు మృతిచెందినా ఒకే తరహా బీమా సౌకర్యం కల్పించాలని, ఇందుకోసం రైతులందరూ సభ్యులుగా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలని సూచించారు. దేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పెద్ద యంత్రాంగం ఉంది. ఎల్‌ఐసీ.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ. ప్రజలకు ఈ సంస్థపై నమ్మకమున్నది. అందుకే రైతు జీవిత బీమా పథకాన్ని ఎల్‌ఐసీ ద్వారా అమలుచేయాలి. రైతులకు జీవిత బీమా పథకం దేశంలోనే మొదటిది. ఈ పథకం రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులలో వివిధ వయస్సులకు చెందిన వారు ఉంటారు కాబట్టి ఎల్‌ఐసీ నిబంధనలు ఎలా ఉన్నాయి? తెలంగాణ రైతు జీవిత బీమా పథకం ఎలా ఉండాలనే అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి, రైతులందరికీ వర్తించేలా నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని అన్నారు. ఈ మేరకు ఎల్‌ఐసీ అధికారులతో చర్చలు జరుపాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, మండలాలవారీగా రైతులు, వారి నామినీల జాబితాలను రూపొందించాలని చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణలో వ్యవసాయం జూదంగా మారింది. ఏ పంట వేసినా ఫలితం కానరాని దుర్భర పరిస్థితులు దాపురించాయి.
మార్కెట్ ధరలను చూసి ఆయా పంటలు వేసి రైతులు చేతులు కాల్చుకుంటున్నారు. ఇందుకు కంది,మిర్చి,ఉల్లి, పసుపు పండించిన రైతుల దీనగాధలే నిదర్శనం. నిజానికి దేశంలో రైతులకు ఎంత చేసినా తక్కువే. తమ చెమటోడ్చి మనకు అన్ని విధాలుగా భోజనం పెడుతున్న అన్నదాతకు అగ్రతాంబూలం ఇవ్వాలి. ఆ విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలి. పంటలు పండక ఆశలుడిగిన రైతులు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంచుమించుగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి దుర్భర పరిస్థితులే తాండవిస్తున్నాయి. అందుకే రైతులను ఆదుకునేందుకు ఏ చిన్న పని చేపట్టినా అది పెద్దగానే కనిపిస్తుంది. ఉచిత విద్యుత్, రుణమాఫీ లాంటి పథకాలు కూడా వారి జీవితాలను మార్చలేక పోతున్నాయి. ఈ దశలో తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా సిఎం కెసిఆర్ భగీరథ యత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా అనేక ప్రాజెక్టులను చేపట్టారు. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్దరణ చేపట్టారు. తాజాగా ఎరువుల కోసం ఒక్కో రైతుకు నాలుగువేలు అందచేస్తున్నారు. నిజంగా ఇదో సాహసోపేత చర్యగానే గుర్తించాలి. ఎందుకంటే రైతులు చితికి పోతున్న తరుణంలో వారికి ఏ రకమైన సాయం చేసినా అది నదిలో కొట్టుకుపోతున్న వారికి ఆసరాగా లభించిన గడ్డిపోచలాంటిది. ఏ రకంగా చేస్తే వారిని ఆదుకోగలమో సిఎం కెసిఆర్ మాత్రమే అర్థం చేసుకోగలరు.తెలంగాణలో రైతుల స్థితిగతు లను మార్చటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రూ.16 వేల కోట్లకుపైగా పంటరుణాలను మాఫీ చేసింది. సాగులో అత్యాధునిక పద్ధతులను ప్రోత్సహించ టానికి భారీ సబ్సిడీ విూద యంత్ర పరికరాలను అందజేస్తున్నది. నకిలీ విత్తన కంపెనీలపై ఉక్కుపాదం మోపుతున్నది. రైతులకు 9 గంటల స్థానంలో నిరంతరంగా కరెంటును సరఫరా చేస్తున్నది. నాలుగేండ్ల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అనుక్షణం అండగా నిలుస్తూ తీసుకున్న నిర్ణయాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు దీనికితోడు బీమా అందించడంతో ఇక రైతులకు ఆత్మహత్యలు చేసుకునే అవసరం రాదు. వారికి భరోసా దక్కగలదు. అందుకు సిఎం కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలి.