పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా?
హైదరాబాద్ (జనంసాక్షి) : నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. “వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులకు ఏం చేస్తున్నారు? పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా? అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదు”అని హైకోర్టు ఆక్షేపించింది. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.