ఢల్లీిలో సీఎం రేవంత్‌ కేంద్రమంత్రులతో వరుసభేటీలు

` ఇచ్చిన మాట ప్రకారం కులగణన
` రాహుల్‌ మాట మేరకు తెలంగాణలో విజయవంతం
` ఎఐసిసి సంవిధాన్‌ రక్షణ అభియాన్‌ కార్యక్రమంలో సిఎం రేవంత్‌
న్యూఢల్లీి(జనంసాక్షి): తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేపడుతున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. సంవిధాన్‌ రక్షణ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, దళితులకు, ఆదివాసులకు భూ చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. భారత్‌ జోడో యాత్ర పేరిట రాహుల్‌ గాంధీ అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి ఇబ్బందులు తెలుసుకున్నారని అన్నారు. రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా కుల గణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు గాంధీ పరివార్‌ ఉందని.. రాహుల్‌ గాంధీకి అండగా తాము ఉన్నామని వ్యాఖ్యానించారు. రైతుల తరఫున నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ అందోళన చేశారని.. అందుకే కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందని వివరించారు. తెలంగాణ సర్కార్‌ ప్రతిష్ఠాత్మకంగా కులగణన చేపట్టింది. కొన్ని చోట్ల ఇప్పటికే ప్రజల నుండి వివరాలు నమోదు చేసుకుంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సర్వేను పర్యవేక్షిస్తూ సర్వే సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తున్నారు. సర్వేలో మొత్తం 85 వేల మంది ఎన్యుమరేటర్లు, 8,500 మంది సూపర్‌వైజర్లు పాల్గొంటున్నారు. ఇంటి నంబరు, యజమాని పేరు నమోదు చేసే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నేతలు పాల్గొంటున్నారు. ప్రతి కుటుంబంలో సభ్యులందరి ఫోన్‌, ఆధార్‌ నంబర్లు సహా సమస్త వివరాలతో కూడిన 75 ప్రశ్నలను అడిగి నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,17,44,954 కుటుంబాలున్నాయని.. ఇళ్లను 87,092 ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లుగా విభజించి కులగణన చేపట్టినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ తెలిపారు.అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌?తోనే సాధ్యమని, రాహుల్‌ గాంధీ నాయకత్వంలో అందరికి సామాజిక న్యాయం జరుగుతోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, లోక్‌ సభ పక్ష నేత రాహుల్‌ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తదితర కీలక నేతలు హాజరయ్యారు. దేశంలో రాజ్యాంగ పవిత్రతను కాపాడిరది కాంగ్రెస్‌ పార్టీనేనని అన్నారు. గాంధీ పరివార్‌ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే.. మోడీ పరివార్‌ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తోందని ్గªర్‌ అయ్యారు. రాజ్యాంగ పరిరక్షణలో రాహుల్‌ గాంధీ వెంట దేశ ప్రజలంతా ఉన్నారన్నారు. ప్రతి ఒక్క వర్గానికి కాంగ్రెస్‌ పార్టీ న్యాయం చేసిందని.. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కాపాడిరది కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు. కుల గణనతోనే ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయని.. ఇందుకోసమే దేశవ్యాప్తంగా కుల గుణన కోసం కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని తెలిపారు. దేశంలో సామాజిక న్యాయాన్ని అందించింది ఒక్క కాంగ్రెస్‌ పార్టీనేనని అన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట ప్రకారమే తెలంగాణలో కుల గణన చేపట్టామని.. కుల గణన సర్వే ఇప్పటి వరకు 92 శాతం పూర్తి అయ్యిందని వెల్లడిరచారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జన గణన సర్వేలోనూ కులాల లెక్కలు తీయాలని ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో మరిన్ని విమానాశ్రయాలు
` తర్వలో మూడిరటిని అభివృద్ధి చేస్తాం
` ఢల్లీిలో ముఖ్యమంత్రి రేవంత్‌తో భేటిలో కేంద్రమంత్రి రామ్మోహన్‌
` వరంగల్‌ ఎయిర్‌ పోర్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం విజ్ఞప్తి
న్యూఢల్లీి(జనంసాక్షి):రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.. ముఖ్యంగా వరంగల్‌ ఎయిర్‌ పోర్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. భూ సేకరణ ఎంత తొందరగా పూర్తయితే.. అంత త్వరగా ఎయిర్‌ పోర్టు నిర్మాణ పనులు చేపడతామని కేంద్ర మంత్రి హావిూ ఇచ్చారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో ఎయిర్‌ పోర్టు నిర్మాణాలు చేపట్టాలని సీఎం ప్రతిపాదించారు.
దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడితో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యులు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎయిర్‌ పోర్టుల నిర్మాణాలకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలోనే వరంగల్‌ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢల్లీిలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడితో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. వరంగల్‌తోపాటు మరో మూడు.. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి తమను కోరారన్నారు. అయితే పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందన్నారు. అందుకు సంబంధించిన నివేదిక సానుకూలంగా వస్తే.. అనంతరం భూసేకరణకు వెళ్ల వచ్చని ఆయన చెప్పారు. ఇక ఆదిలాబాద్‌ విమానాశ్రయం మాత్రం రక్షణ శాఖ పరిధిలో ఉందని గుర్తు చేశారు. ఆ శాఖ నుంచి అనుమతి వస్తే.. ఆదిలాబాద్‌లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అదీకాక ఆదిలాబాద్‌కు ఓ వైపు చత్తీస్‌గఢ్‌, మరోవైపు మహారాష్ట్రలు సరిహద్దులు ఉన్నాయన్నారు. దీంతో ఆ దరిదాపుల్లో విమానాశ్రయం లేదని గుర్తు చేశారు. అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడు అభిప్రాయపడ్డారు. మరోవైపు వరంగల్‌ విమానాశ్రయం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రో యాక్టివ్‌గా వ్యవహరిస్తూ.. భూసేకరణకు ఇప్పటికే సర్క్యులర్‌ సైతం జారీ చేసిందని ఆయన వివరించారు. ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ద్వారా వరంగల్‌లో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ఢల్లీి పర్యటన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ సోమవారం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఉదయం కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడుతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. అంతకుముందు పౌర విమానయాన శాఖ మంత్రి కార్యాలయానికి సీఎం రేవంత్‌ రెడ్డి విచ్చేయడంతో.. ఆయనకు ఎదురేగి కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత తన కార్యాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలను కేంద్ర మంత్రి శాలువాలతో సత్కరించి.. తిరుమల శ్రీవారి ప్రతిమలను వారికి అందజేశారు. అనంతరం వారు.. కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుతోపాటు ఆ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకు అనుమతితోపాటు వరంగల్‌ విమానాశ్రయం అంశాలపై వారు కులంకుషంగా చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను సైతం సీఎం రేవంత్‌ రెడ్డి కలవనున్నారు. రాష్టాన్రికి రావాల్సిన ప్రాజెక్టులు,నిధులు తదితర అంశాలను ఈ సందర్బంగా వారితో సీఎం చర్చించనున్నారు.