దిలావర్‌పూర్‌లో ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు నిలిపేయండి

నిర్మల్‌ (జనంసాక్షి) : ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబుకడంతో సర్కార్‌ దిగొచ్చింది. మంగళవారం మొదలైన భారీ ఆందోళన బుధవారం వరకూ పెద్దఎత్తున కొనసాగడంతో నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ స్థానికులతో చర్చలు జరిపారు. ఈ మేరకు ఘటనకు సంబంధించిన విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఫ్యాక్టరీ పనులు నిలిపివేయవలసిందిగా జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే పూర్తి స్థాయి రద్దు ప్రకటన చేయాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.