తెలంగాణ సాయుధ పోరాట సమయం లో బీజేపీ ఎక్కడ ఉన్నది

దేశం లో మత ఘర్షణ లకు కారణం ఎవరు
*ప్రపంచం లో ఆర్ధిక సంక్షోభం ఉన్న భారత దేశం
*1948 లో విలీనం జరిగినా సైన్యం మాత్రం 1951 వరకు ఉంది కేవలం కమ్యూనిస్ట్ లను నిర్ములించేందుకే
*బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రత్యేక చట్టాలు రూపొందించారు.
* మోదీ కి ఇద్దరే కనిపిస్తున్నారు
ఒకరు అంబానీ. రెండు… ఆదాని
*11 లక్షల కోట్లు అప్పులు ఎగగొట్టారు
*జి ఎస్ టీ అమలు తో కుదెలు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు
కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి
మిర్యాలగూడ జనం సాక్షి.
తెలంగాణ సాయుధ పోరాట సమయంలో భారతదేశంలో పార్టీ ఎక్కడుందని కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచురి ప్రశ్నించారు.
తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా మిర్యాలగూడ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఎస్పీ క్యాంప్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ 1948లో తెలంగాణ ప్రాంతం దేశంలో విలీనమైనప్పటికీ 1951 వరకు భారత దేశ సైన్యం ప్రాంతంలోనే కాపలా కాసిందని అది కేవలం కమ్యూనిస్టుల ఎదుగుదల లేకుండా చేసేందుకే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి బిజెపి పబ్బం గడుపుకుంటుందని, దేశవ్యాప్తంగా బిజెపి పాలిత రాష్ట్రాలలో చట్టాలు ఏర్పాటు చేసిందని ప్రధానంగా ముస్లిం లకు వ్యతిరేకంగా రూపొందించబడ్డాయని ఆరోపించారు. దేశంలో ప్రభుత్వ సంపద అయిన ప్రభుత్వ రంగ సంస్థలన్ని ప్రజల లేకుండా ప్రైవేట్ పరం చేస్తూ దేశవ్యాప్తంగా యువకులలో భద్రత భావాన్ని పెంచి పోషిస్తున్నారని అన్నారు. దేశంలో 11 లక్షల కోట్ల రూపాయల అప్పులను మాఫీ చేసి మరింత ఇబ్బందుల పాలు చేసిందని, ప్రధాని మోదీకి ఇద్దరు వ్యక్తుల కనిపిస్తున్నారని వారు అంబనీ, ఆదానీలుగా పేర్కొన్నారు. దేశ సంపద మొత్తం వారిరువురికే దార దత్తం చేస్తున్నారని ఏచూరి విమర్శించారు. దేశ ప్రజలకు ప్రజాస్వామ్య వాదంతో శంఖారావం పూరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా సభలో శంఖారావాన్ని పూరించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. స్వార్ధ రాజకీయాలతో దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ రైతంగ సాయుధ పోరాట మీరు నన్ను సన్మానించారు. పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్ అధ్యక్షతన జరిగిన సభలో చెరుపల్లి సీతారాములు. డిజి నరసింహారావు. మల్లు లక్ష్మి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి నర్సిరెడ్డి. తుమ్మల వీరారెడ్డి. నారి ఐలయ్య. బండా శ్రీశైలం. పాలడుగు నాగార్జున. ప్రభావతి. బద్రి శశిధర్ రెడ్డి. జీ వరలక్ష్మి వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు