ధాన్యం కొనాల్సిందే..


` పార్లమెంట్‌లో నిలదీస్తాం
` రేవంత్‌,కొమటిరెడ్డి
హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):ఎట్టిపరిస్థిల్లోనూ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు వరి ధాన్యం కొనాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద కాంగ్రెస్‌ చేపట్టిన రెండ్రోజుల వరిదీక్షను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనకపోతే కేసీఆర్‌ గద్దె దిగాల్సిందేనని డిమాండ్‌ చేశారు. రైతుల కోసం శనివారం రాత్రి ధర్నాచౌక్‌లోనే నిద్రిస్తామని ప్రకటించారు. రైతుల మృతికి సీఎం కేసీఆర్‌ కారణమని దుయ్య బట్టారు. వరి కుప్పలపైనే రైతు గుండె ఆగిపోతున్నా కేసీఆర్‌లో చలనం లేదని తప్పుబట్టారు. కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదని, మద్దతు ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌ ధాన్యం కొనకుండా దళారీగా మారారని, రైతులపై ఆయన కక్షగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండు, అరగుండు మనకు పంగనామాలు పెడతారని తెలిపారు. కేసీఆర్‌, మోదీ ఇద్దరూ వేరు కాదు..ఒకరు సారా మరొకరు సోడా అని విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు తోడుదొంగలేనని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనకుండా సీఎం కేసీఆర్‌ దళారీగా మారాడన్నారు. వరి కుప్పలపైన రైతుల ప్రాణాలు పోతున్నా సీఎం పట్టించు కోవడం లేదన్నారు. వారికి కనీసం రైతు బీమా కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌ పోరు కొనసాగిస్తోందన్నారు. రైతుల కష్టానికి దళారులు ధర నిర్ణయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల చావులకు కేసీఆర్‌ కారణమన్నారు. కల్లాల్లో ఉన్న పంట కొనకుండా, యాసంగి గురించి మాట్లాడాడం సిగ్గుచేటన్నారు. రూ. లక్ష కోట్లతో ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న కేసీఆర్‌..రైతులు పండిరచిన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెబితే…రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 8 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం దిగివచ్చి ధాన్యం కొనుగోలు చేసేవరకు కొట్లాడుతామని స్పష్టం చేశారు. వరి కొనకపోతే టీఆర్‌ఎస్‌, బీజేపీకి ఉరేనన్నారు.
రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తు చేశారు రేవంత్‌. రైతులు పండిరచిన పంటను కొనుగోలు చేసేందుకు ఎఫ్‌ సీఐ విధానాన్ని తీసుకొచ్చి, గిట్టుబాటు ధర కల్పించింది కూడా కాంగ్రెస్‌ పార్టీయేనని తెలిపారు. రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చిన కాంగ్రెస్‌ ను సీఎం కేసీఆర్‌ ప్రశ్నించడం దారుణమన్నారు. కేసీఆర్‌ ఢల్లీికి పోయి దావత్‌ చేసుకొని వచ్చారన్న రేవంత్‌.. ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్‌ లో కొట్లాడుతామన్నారు. దసరా దీపావళి పండగలు చేసుకోకుండా రైతులు కల్లాల దగ్గర పడుకుంటున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. పనికిరాని మంత్రులను తీసుకుని కేసీఆర్‌ ఢల్లీి వెళ్లారని విమర్శించారు. మోడీ అపాయింట్‌ మెంట్‌ తీసుకోని కేసీఆర్‌ ఢల్లీి ఎందుకు వెళ్లిండు? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మానవత్వం లేదని, ధనార్జనే ఆయన ద్యేయమన్నారు. 20వేల కోట్లు పెడితే రైతుల ధాన్యం మొత్తం కొనొచ్చన్నారు. కేసీఆర్‌ పెద్ద మోసగాడు, కాళేశ్వరం పెద్ద గోల్‌ మాల్‌ అని విమర్శించారు. కేసీఆర్‌ది నాలుక కోసినా తప్పులేదని, దళితులకు మూడెకరాల భూమి నేనెప్పుడూ ఇస్తా అన్న అంటున్నాడని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దొంగల ముఠాలా మారి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌.. ప్రధాని మోడీ అపాయింట్‌ మెంట్‌ అడగలేదని పీఎంవో ద్వారా తెలుకున్నానని అన్నారు. డబ్బుపై, రాజకీయాలపై వున్న సోయి.. కేసీఆర్‌ కు రైతులపై లేదని ఆరోపించారు. రైతు ఏడ్చిన రాష్ట్రం ఎప్పుడు బాగుపడదన్నారు. హుజురాబాద్‌ లో దళిత బంధు ఓ లెక్కనా అన్న కేసీఆర్‌.. రైతులకు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు ఇచ్చుడే మరిచిండు అని అన్నారు. చంద్రబాబు.. కరెంట్‌ తీగల పై బట్టలు ఆరేసుకోవాలని అంటే..వైఎస్‌ఆర్‌ వచ్చాక ఉచిత కరెంట్‌ ఇచ్చారని తెలిపారు. మేడ్చల్‌ విూటింగ్‌ లో తెలంగాణ ప్రజలు బాగుపడలేదని సోనియా ఆవేదన వ్యక్తం చేశారని.. కానీ కేసీఆర్‌ కుటుంబమే బాగు పడిరదని చెప్పారు. దళితులకు.. 3 ఎకరాల భూమి, దళిత సీఎం అని చెప్పి.. నేనెందుకు అన్నా అని అంటున్నాడని అన్నారు. కెసిఆర్‌ జోకర్‌ లాంటి రాజకీయ నాయకుడన్నారు. తెలంగాణ కోసం సొంత పార్టీ నేతలను కూడా బెదిరించి తెస్తే.. కేసీఆర్‌ ఆగం చేస్తుండన్నారు. అన్నం పెట్టే అన్నదాత పాసిపోయిన అన్నం తింటున్నాడని చెప్పారు. నిరుద్యోగ యువత జాబ్స్‌ లేక చనిపోతున్నారని అన్నారు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి. కేసీఆర్‌ పాలనలో ఎమ్మెల్యే లు 12 కోట్ల కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. రెండేళ్లలో కాంగ్రెస్‌ సర్కార్‌ వస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు.. హైటెక్‌ సిటి కట్టిండు.. కానీ రైతులను పట్టించుకోక పోవడంతో ఓడిపోయాడన్నారు. కేసీఆర్‌ పెన్షన్లు, రైతు బందు అని ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. లిక్కర్‌ రేట్లు పెంచి ఖజానా నింపుకుంటున్నాడని ఆరోపించారు. తడిచిన ధాన్యాన్ని కూడా కొనాలని.. తేమ శాతం పేరుతో మోసం చేస్తున్నారని… దాన్ని కూడా బంద్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో, రాష్ట్రంలో 50 నుండి 60 శాతం జనాభా వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్నా యని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తం కుమార్‌ రెడ్డి తెలిపారు. అయితే ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ లు కలిసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆగస్ట్‌ నెలలో 5కోట్ల టన్నుల ధాన్యం సేకరణకు కేంద్రం ఒప్పందం జరిగిందని తెలిపారు. కేంద్రం 40 లక్షల టన్నుల బియ్యం సేకరణకు టాª`గ్గంªట్‌ పెట్టిందన్నారు. అంటే.. 60లక్షల టన్నుల వడ్లు సేకరించాలని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 8 లక్షల టన్నులు కూడా సేకరించలేదన్నారు. పంజాబ్‌ లో ఇప్పటికే కోటి 10లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించిందన్నారు ఉత్తం. మన కంటే చిన్న రాష్టాల్రు కూడా 40 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరిస్తున్నాయన్నారు. వరి రైతులు నష్ట పోడానికి కేసీఆరే కారణమన్నారు .మరో వైపు అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమయ్యారన్నారు. తేమ శాతం పేరుతో మిల్లర్లు, అధికారులు మోసం చేశారని అన్నారు. వానలకు తడిసిన వడ్లు మొలకలెత్తాయన్నారు. కేసీఆర్‌ మిల్లర్ల తో కుమ్మకయ్యారని ఆరోపించారు.రబీ పంటలపై ఆంక్షలు వద్దన్నారు. పార్లమెంట్‌ సమావేశంలో వరి రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. అన్ని విధాలుగా కేసీఆర్‌ తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ఛత్తీస్‌ఘడ్‌ లో వరికి క్వింటాల్‌ కి 500 బోనస్‌ ఇస్తోందని తెలిపారు. పంజాబ్‌ లో కోటి 10లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ అయ్యిందన్న ఉత్తం..ధనిక రాష్ట్రంలో ఎందుకు రైతులపై చిన్న చూపు అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, పంట బీమా ఇవ్వకుండా కేసీఆర్‌ మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పండిన అదనపు ధాన్యాన్ని నిల్వ చేసి ఇతర రాష్టాల్రకు, విదేశాలకు సప్లయ్‌ చేసే వ్యూహం ఉండాలని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ నగరంలో కాంగ్రెస్‌ ఆధ్యర్యంలో జరుగుతున్న వరి దీక్షలో ఆయన మాట్లాడారు. వడ్లు కొనకుండా కేంద్ర, రాష్ట్ర సర్కార్లు దొంగ డ్రామాలాడుతున్నాయని ఆయన ఆరోపిం చారు. ఈ రెండు ప్రభుత్వాలకు వ్యవసాయ ప్రణాళికలు లేవన్నారు. ప్రజలను, రైతులను మోసం చేస్తూ మోదీ, కేసీఆర్‌ పాలన చేస్తున్నారని ఆరోపించారు. రైతులను చైతన్య పరిచే కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు.