తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన
వచ్చే మూడు గంటల్లో హైదరాబాద్‌లో వర్షాలు
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్..
రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు వర్ష సూచన
తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. రానున్న మూడు గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్..రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఇటీవల కాలంలో ప్రతి రోజూ అకస్మాత్తుగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్నారు. విధులకు వెళ్లిన వారు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. రహదారులన్నీ జలమయిపోతున్నాయి. చెరువుల్లా మారిపోతుండటంతో వాహనాలు వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఆఫీసుల నుంచి బయలుదేరే సమయంలోనే ఈ వర్షం పడుతుండటంతో హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణ వర్షం పుడుతుందని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.