మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి

వాటర్ ట్యాంకర్-బైక్ ఢీకొని నలుగురు మృతి..
మనోహరాబాద్‌ మండలం పోతారం దగ్గర ఘటన..
పోతారం దగ్గర రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతులు..
ధాన్యం కుప్పలు ఉండటంతో ఒక వైపు నుంచే రాకపోకలు..
ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీన్న ట్యాంకర్, నలుగురు మృతి..

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన మనోహరాబాద్‌ మండల పరిధిలోని పోతారంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతారం గ్రామానికి చెందిన మన్నె కుమార్‌ భార్య లావణ్య (35) తన ఇద్దరు పిల్లలు సహస్ర (10), శాన్వి (6)లతో కలిసి బావ అయిన మన్నె ఆంజనేయులు (50)తో ద్విచక్ర వాహనంపై శభాష్‌పల్లి వైపు వెళ్తున్నది.ఈ క్రమంలో గ్రామ శివారులోని ప్రాణ ఫుడ్స్‌ పరిశ్రమ వద్ద రోడ్డుపై ధాన్యం కుప్పలు ఎదురుగా ఉండడం.. వాటిని తప్పించబోయారు. అయితే, ఎదురుగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ బైక్‌ను వేగంగా ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణం రహదారిపై వడ్లకుప్పలు పోయడమే కారణమని పేర్కొంటున్నారు. ఒక వైపు వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురిని బలి తీసుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.