నలంద స్కూల్లో ఫ్లవర్స్ డే వేడుకలు
జనం సాక్షి ఆర్మూర్ రూరల్ ఆగస్టు 30
నలంద స్కూల్లో మంగళవారం ఫ్లవర్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఫ్లవర్ ఆకారాలను బట్టి వాటి యొక్క రంగుల తేడాలను రకరకాల పువ్వులను గుర్తించేందుకు ఆస్కారం కల్పించడం జరిగింది.
కుసుమం అనగా పువ్వు అని అర్థం. పిల్లలు కూడా పువ్వువలె సున్నితమైన మనసు కలవారని నలంద స్కూల్ కరస్పాండెంట్ లక్కారం ప్రసాద్ పిల్లలను ఉద్దేశించి అన్నారు. ఉపాధ్యాయ బృందం పిల్లలను రకరకాల పువ్వుల ఆకారాలలో తయారు చేయించి అందరినీ ఆకర్షింప చేశారని నలంద స్కూల్ ప్రిన్సిపల్ లక్కారం సాగర్ మాట్లాడుతూ పిల్లలు అందరినీ ఆకట్టుకున్నారని అన్నారు. స్కూల్ ఇన్చార్జ్ అయినా అరుంధతి, శ్రావణి, రమ్య, అర్షియా, నిహారిక, మేడం లకు నలంద స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బందితోపాటు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు…