నిజాం నిరంకుశ మూర్ఖత్వానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు……
టేకుమట్ల.సెప్టెంబర్17(జనం సాక్షి)నిజాం నిరంకుశ మూర్ఖత్వానికి తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ ఆద్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణకు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిధిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రజాకారుల పాలనలో తెలంగాణలోని ప్రజలు అనేక విధాలుగా కష్టాలు పడుతూ చాలా ఇబ్బందులకు గురవడం జరిగిందని గుర్తు చేశారు. నిజాం నిరంకుశ మూర్ఖత్వానికి తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. రజాకారుల విముక్తి కోసం ప్రజలు ఎంతో మంది తమ ప్రాణాలు సైతం అర్పించడం జరిగిందని తెలంగాణ ప్రాంతానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక చొరవతో ఈ రోజున మనకు స్వాతంత్ర్యం రావడం జరిగిందని ఆయన వివరించారు.స్వాతంత్ర్యం కోసం రజకారుల విముక్తి కోసం పోరాటం చేసిన వీరుల త్యాగాలు నేటి యువత స్పూర్తిగా తీసుకోని స్వేచ్ఛ స్వాతంత్ర్యంగా జీవించాలని సూచించారు.అనంతరం ప్రధాన మంత్రి జన్మదినాన్ని నిరుద్యోగ దినోత్సవంగా ప్రకటించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశానుసారం టేకుమట్ల మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ విభాగం ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు టీ,పండ్లు అమ్ముతూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ప్రధాని మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇవ్వకపోవడం సిగ్గు చేటు అని అన్నారు.ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎన్నో పై చదువులు చదివిన నిరుద్యోగులు రోడ్ల పక్కన పండ్ల షాపులలో పండ్లు అమ్ముతు నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వైనాల రవీందర్,పెరుమండ్ల లింగయ్య,యువజన కాంగ్రెస్ మండల నాయకులు పెరుమండ్ల క్రాంతి,వైనాల యశ్వంత్,రెడ్డి రాజుల రాజు,మచ్చ ప్రభాకర్,యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.