నొవార్టిస్‌కు సుప్రీంకోర్టు చెంపదెబ్బ
సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలు మార్కెట్‌పై ఆధిపత్యం కోసం పేటెంట్ హక్కులు పొంది స్థానిక కంపెనీలు ఎదగనివ్వకుండా, ప్రజలను ఎలా దోచుకుంటున్నాయో వివరిస్తున్నారు. పి.వి రమణ
స్విట్జార్లాండ్‌కు చెందిన దిగ్గజం నొవార్టిస్‌కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఏప్రిల్ 1న ఇచ్చిన 98పేజీల భారతీయ ఫార్మా కంపెనీలు, న్యాయ నిపుణులు, పేద క్యాన్సర్ రోగులు సంతోషంగా ఆహ్వానిం చారు. మన దేశంలో రక్త, చర్మ క్యాన్సర్ రోగ చికిత్సకు వాడే గ్లివెక్ ఔషధం చాలా ఖరీదైనది. నెల రోజుల ఔషధం నొవార్డిస్ 1లక్షా 20వేల రూపాయలకు అమ్ముతుండగా, అదే ఔషధాన్ని భారతీయ కంపెనీలు త్పుత్తి చేస్తున్న జనరిక్ మందులు కేవలం ఎనిమిది వేల రూపాయలకు లభిస్తున్నాయి. గ్లివెక్ ఔషధంలో తాము ఆవిష్కరించిన ఇమాటినిబ్ మెసెలైట్ అనే పదార్థాన్ని ఉపయోగిస్తున్నామని, దానిపై తమకు పేటెంట్ హక్కు కావాలని నొవార్టిస్ 2006లో చెన్నైలో ఉన్న పేటెంట్ కంట్రోలర్ వద్ద నివేధించగా దానిని అక్కడ తిరస్కరించారు. 2007లో మద్రాస్ హైకోర్టు కూడా ఈ వాదనను తోసి పుచ్చింది. చివరిగా 2009 ఆగస్ట్‌లో నొవార్టిస్ భారతీయ కంపెనీలు తయారు చేస్తున్న జనరిక్ వెర్షన్ ఔషధ ఉత్పత్తిని నిరోధించాలని తమకు పేటెంట్ అనుమతి ంచాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. నొవార్టిస్ వాదనను తోసి పుచ్చుతూ ఈ ఔషధం తయారీలో ఉపయోగించినట్లు చెపుతున్న ఇమాటినిబ్ మెసైలైట్ ఇప్పటికే బహుళ ప్రాచుర్యం పొంది ఉందని, అందులో సరికొత్త ఆవిష్కరణేమీ తమకు కనిపించలేదని, భ్రమను కలిగించే పదాల మాయాజాలంతో పేటెంట్‌ను కోరితే దానికి లొంగిపోయి వారికి పేటెంట్ హక్కును అనుమతించలేమని, జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్, జస్టిస్ ఆఫ్తాబ్ ఆలంల సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. ‘ఔషధాలపై పేటెంట్ లేకపో యినట్లయితే, వాటిని తాము సరసమైన ధరలకు అందుబాటులోకి తెగలమన్న భారతీయ ఫార్మా కంపెనీల వాదనకు ఇది విజయమని, రాన్‌బాక్సీ, సిప్లా కంపెనీల తరుపున వాదించిన న్యాయవాది ప్రతిభాసింగ్ వ్యాఖ్యానించారు. పాత పరిశోధనలను కొద్దిగా మార్చి కొత్తఆవిష్కరణలుగా ప్రకటించే వాటికి తిరస్కారం తప్పదన్న సందేశాన్ని కూడా ఈ తీర్పు ద్వారా వెల్లడయిందని అన్నారు. పేద రోగులకు అనుకూలంగా వెలువడిన చారిత్రాత్మక తీర్పు ఇది అని ఇండియన్ ఫార్మసూటికల్ అలయన్స్, భారత ఔషధ ఉత్పత్తిదారులు సంఘాలు కొనియాడాయి. తప్పుడు పేటెంట్లతో మార్కెట్‌లో గుత్తాధిపత్యం సాధించాలకునే వారికి ఇది గుణపాఠమని కాన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్ లాయర్ వినా మెంగానాయ్ అన్నారు.1995 కంటే ముందు భారతదేశ మార్కెట్‌లో అందు బాటులో ఉన్న ఔషధానికి కొద్దిపాటి మార్పులు చేసి గ్లివెక్‌ను రూపొందించి దానికి పేటెంట్ కావాలని 1998 నుంచీ నొవార్టిస్ డిమాండ్ చేస్తోంది. అప్పటికే ప్రాచుర్యం పొందిన ఔషధాలు పేటెంట్ హక్కుకు అర్హులు కావని భారత పేటెంట్ చట్టంలో సెక్షన్ 3డీ నిర్దేశిస్తుంది. ప్రజా ప్రయోజనాలు దెబ్బ తీసేవి, అప్పటికే మార్కెట్‌లో ఉన్న ఔషధాల ఎన్నా సమర్థవంతం కాని ఔషధాలకు పేటెంట్ ఇవ్వరాదని సెక్షన్ 3బి నిర్ధేశిస్తుంది. ఈ నిబంధనల ఆధారంగానే గ్లివెక్‌కు జనరిక్ వెర్షన్ తయారు చేస్తున్న భారత ఫార్మా కంపెనీలు నొవార్టిస్ వాదనను తోసిపుచ్చాయి. ఔషధాల్లో చిన్న చిన్న మార్పులు చేయడం లేదా ఒకే పదార్థంలో స్వల్ప మార్పులతో తిరిగి ఔషధాన్ని తయారు చేయడం ద్వారా వాటికి నిరంతర పేటెంట్‌గా మార్చేందుకు నొవార్టిస్ ప్రయత్నిస్తుందని భారత ఫార్మా కంపెనీలు వాదించాయి. సరిగ్గా పేటెంట్ కాలపరిమితి ముగిసే ముందు ఇలాంటి చర్యలకు ప్పాలడడం, పేటెంట్లకు అదనపు కాలపరిమతి పొంది, చౌకగా ఉత్పత్తి చేస్తున్న జనరిక్ ఔషధాలకు అడ్డుతగలడం ఈ బహుళజాతి కంపెనీల వ్యూహమని ఈ కంపెనీలు ఆరోపించాయి. నొవార్టిస్ అభ్యర్థనకు అనుగుణంగా పేటెంట్ లభించి ఉంటే ఈ ఔషధంపై మరో ఇరువై సంవత్సరాల వరకు గుత్తాధిపత్యం లభించి ఉండేదని నిపుణులు అభిప్రాయ పడ్డారు.ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పదంపై భారతదేశం సంతకం చేసిన తర్వాత వాణిజ్య సంబంధిత మేధోపర హక్కుల నిబంధనకు అనుగుణంగా మన దేశంలో 2005లో కొత్త పేటెంట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీంతో అంత వరకూ ఉన్న 1970 పేటెంట్ చట్టంలో ఉన్న ప్రజాహిత, జాతీయ ప్రయోజనాలన్నింటికీ తూట్లు పడ్డాయి. కార్పొరేట్ సంస్థలకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టే నూతన క్లాజులు చేర్చబడ్డాయి. దీని వలన ఆరోగ్యం, వ్యవసాయ రంగాలలో బహుళజాతి సంస్థలకు తిరుగులేని పరిస్థితి ఏర్పడింది. గతంలో గుత్తాధిపత్యాన్ని నివారించి పోటీ ద్వారా చౌక ధరలకు ప్రజలకు మందులు అందుబాటులోకి తీసుకురావా లన్న ఉద్దేశంతో మన దేశంలో మందుల ఉత్పత్తి ప్రక్రియకు మాత్రమే ఏడు సంవత్సరాల గడువుతో కూడిన పేటెంట్లు జారీ చేసే విధానం ఉండేది 2005 చట్టం ప్రజా ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా, ఉత్పత్తులు, ఉత్పత్తి ప్రక్రియలు రెండింట ిపైనా, ఇరవై సంవత్సరాల గుడువుతో 1995 తర్వాత ఆవిష్కరణలకు మాత్రమే పేటెంట్లను జారీ చేసే విధానం అమలు చేశారు. అప్పటి నుంచి అనేక మందుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి.
బహుళజాతి సంస్థల అహంకారం
సుప్రీంకోర్టు తీర్పును విమర్శిస్తూ ప్రజలకు ఔషధాలు అందుబాటులో ఉండాలంటే పేటెంట్ విధానాన్ని ధ్వంసం చేయడం మార్గం కాదు. రోడ్డు మీద ఒక పిల్లాడు బట్టలు లేకుండా ఏడుస్తుంటే దానికి కారణం బట్టల పరిశ్రమలేనని తిడతమా? ప్రజల ఆరోగ్యానికి చేసే ఖర్చుల్లో ఔషధాల ఖర్చు కేవలం 6శాతం మాత్రమే. మేం ఒక కొత్త ఔషధాన్ని ఆవిష్కరించడానికి పదిహేనే సంవత్సరాలు పైన కష్టపడి, మూడు నుంచి నాలుగు బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి, లక్ష ప్రమాణాలను పరిశీలించిన తర్వాత ఉత్పత్తి బయటకు వస్తుంది. ఉత్పత్తి బయటకు రాగానే ఆరు నెలలోగా పేటెంట్ లభించకపోతే ఖర్చు పెట్టినదంతా బూడిద పాలవుతుంది. ఎందుకంటే అలాంటి ఉత్పత్తులు పోటీగా మార్కెట్‌లోకి వచ్చేస్తాయి. ఇక తాము భారత్‌లో పరిశోధనల కోసం పెట్టుబడులు పెట్టబోమని, తమకు అనుకూలమైన ఇతర దేశాలకు తరలిస్తామని నొవార్టిస్ ఇండియా వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన రంజిత్‌ను సహాని బెదిరించడమే బహుళజాతి కంపెనీల అహంకారాన్ని స్పష్టంగా బయట పెట్టింది. ఈ తీర్పు వల్ల భారతీయ ఔషధ పరిశ్రమకే నష్టం వాటిల్లుతుంది. వారు స్వతంత్ర పరిశోధనలకు పూనుకోరు గనుక ప్రజలకు అవసరమైన కొత్త ఔషధాల ఆవిష్కరణ జరగదు అని బహుళజాతి కంపెనీల సంస్థ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాసూటికల్ ప్రోడ్యూసర్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కొత్త ఆవిష్కరణలు చేసే పెద్ద కంపెనీలకు ఇలా అడ్డంకులు కల్పిస్తే భవిష్యత్‌లో వాటి పెట్టుబడులు భారత దేశానికి రావు అని కూడా బెదిరించారు. బహుళజాతి కంపెనీల వాఖ్యల్ని ఖండిస్తూ బడా ఫార్మా కంపెనీలు తమ పరిశోధనల వివరాలు, వాటి అభివృద్ధి క్రమాలను సమాజా నికి తెలియనివ్వరు. అవి ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ కోసం పరిశోధనలు సాగిస్తాయి గాని ప్రత్యేకంగా ఏ దేశం కొరకు విడిగా పరిశోధనలు చెయ్యవు. భారతదేశం 2005లో పేటెంట్ చట్టం మార్చిన తర్వాత సెక్షన్ 3డి ఉపయోగించకుండా సరైన పరీక్షలు జరపకుండా వందలాది ఔషధాలకు పేటెంట్లు ఇచ్చినట్లు అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. అని హెల్త్ గ్లోబల్ యాక్సిస్ ప్రాజెక్టు కు చెందిన ప్రొఫెసర్ బ్రూక్ కె. బేకర్ అన్నారు. మన పేటెంట్ చట్టం సెక్షన్ 83 ప్రకారం కొత్త పేటెంట్లను ప్రోత్సహిం చడానికి కారణం వారు భారతదేశంలో మరిన్ని కొత్త ఆవిష్కరణల ఫలితాలు ప్రజలకు అందుబాటులో ఉండే రీతిలో చేయాలి. కాని దానికి విరుద్ధంగా అమలు జరినగినట్లు అనేక ఉదాహరణ లున్నాయి. నిజానికి బహుళజాతి ఫార్మా కంపెనీలు గత ఐదు సంవత్సరాలలో ఎక్కువగా కొత్త ఆవిష్కరణలేవి చేయలేదు.
పరిశోధనలపై ఖర్చు వెనుక అసలు రహస్యం
ప్రాణాల్ని రక్షించే ఔషధ పరిశోధన కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నామని బహుళజాతి ఫార్మా కంపెనీలు నొవార్టిస్‌తో సహా అన్నివాదిస్తున్నాయి. ఇది పెద్ద అబద్ధం. కాన్సర్ రోగ నివారణ కొరకు ఆమెరికాకు చెందిన నేషనల్ కాన్సర్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థలు రెండూ పరిశోధనలు ప్రారంభించాయి. ఈ రెండు సంస్థలూ అమెరికన్ ప్రజల పన్నులతోనూ దాతలిచ్చిన విరాళాలతోనూ నడుస్తున్నాయి. వీటిని లాభాపేక్ష లేకుండా పరిశోధనల ఫలితాలను ప్రజలకు దీర్ఘకాల ఆరోగ్యకరమైన జీవితాలను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. ఏదో ఒక జబ్బును వెంటనే నయం చేయాలనే ధ్యేయంతో ధీర్ఘకాల శాస్త్రీయ పరిశోధనలతో రోగ నివారణ కన్నా రోగ నిరోధానికి ఉపయోగపడేలా కార్యక్రమాలు సాగించాయి. గతంలో ఎన్‌ఐఎచ్ మలేరియా, లెప్రసీ, సానిటేషన్, జీర్ణకోశ సంబంధిత సమస్యలపై పరిశోధనలు జరిపింది. ఈ రోగాలన్నీ అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకే చెందినవి.
– వీక్షణం సౌజన్యంతో
తరువాయిభాగం రేపటి సంచికలో …