పంద్రాగస్టు వేడుకలపై సమీక్ష తిరుపతి
జూలై 27 : 66వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి శేషయ్య జిల్లా అధికారులను కోరారు. శుక్రవారం ఉదయం స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి తన ఛాంబర్లో జిల్లా అధికారులతో సమీక్షించారు. భద్రత, స్టేజి అలంకరణను ఏర్పాట్లను పోలీసు శాఖ, పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను జిల్లా విద్యాశాఖ, ఎగ్జిబిషన్ స్టాల్స్, లబ్ధిదారులకు అసెట్స్ పంపిణీ ఏర్పాట్లు డిఆర్డిఎ, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా మున్సిపల్ కార్పోరేషన్, ప్రసంగ పాఠాన్ని జిల్లా పౌర సంబంధాల అధికారి, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను ఉపకార్య నిర్వహాక ఇంజనీరు, సమాచార శాఖ ఏర్పాటు చేయాల్సి వుంటుందని తెలిపారు. మంత్రి జిల్లా ప్రగతి గురించి ప్రసంగించనున్నందున జిల్లా అధికారులు జూలై వరకు తమ శాఖ సాధించిన ప్రగతిపై సంక్ల్తిప్త నివేదికను పంపాలని కోరారు. డిఆర్డిఎ అనిల్‌కుమార్‌రెడ్డి, రాజేశ్వరరెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి స్వామి, జయప్రకాష్, నాగేశ్వరరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.