పజాస్వామ్యంపై చిగురిస్తున్న ఆశలు

ఆరున్నర దశాబ్దాల స్వాతంత్ర పాకిస్తాన్‌ చరిత్రలో మొట్టమొదటిసారి ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయి. ఈ ఎన్నికల సందర్భంగా హింస ప్రజ్వరిల్లి 50 మందికి పైగా మృత్యువాత పడగా అంతకు రెట్టింపుస్థాయిలో క్షతగాత్రులయ్యారు. తలిబన్‌ ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం, ఐఎస్‌ఐ నీడలో శిక్షిత సంస్థలు ఎప్పటికప్పుడు దేశంలో కళ్లోల పరిస్థితులు సృష్టించడం, నిత్యం బాంబు పేలుళ్లు.. మారణహోమాలు పాక్‌ ప్రజలకు తెలిసినవే. బ్రిటిష్‌ పాలననుంచి విముక్తం అయ్యే పూర్వమే భారత్‌ నుంచి వేరుబడి స్వతంత్ర దేశంగా పాకిస్తాన్‌ ఏర్పడాలని మహ్మద్‌అలీ జిన్నా వ్యూహాలు రచించారు. భౌగోళికంగా వేర్వేరు ప్రాంతాలతో పాకిస్తాన్‌ ఆవిర్భవించింది. తూర్పు పాకిస్తాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌) నుంచి పశ్చిమ పాకిస్తాన్‌కు మధ్య కొన్ని వందల మైళ్ల దూరం. భౌగోళికంగా ఒకే సరిహద్దులోపల లేకపోవడంతో తూర్పు పాకిస్తాన్‌ స్వతంత్రం కోరుకుంది. దానికి భారత్‌ అండగా నిలిచింది. అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న భారత్‌-పాక్‌ సంబంధాలు మరింత క్షీణించాయి. ఇరు దేశాల్లోనూ యుద్ధోన్మాథం వెర్రితలలు వేసింది. భారత్‌లో ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏలుబడిలో ఉంటే పాకిస్తాన్‌లో అధ్యక్ష పాలన కొనసాగింది. పాక్‌లో అత్యంత దేశభక్తులుగా కీర్తించేవారు సైనికులు. దేశంలో ప్రజాస్వామ్యం గాడి తప్పింది అనుకున్నప్పుడు సైనిక తిరుగుబాటు రావడం ప్రభుత్వాన్ని కూల్చేసి సైన్యం గద్దెనెక్కడం జరిగింది. ఇలాగే జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ కూడా సైనిక తిరుగుబాటు ద్వారానే పాక్‌ గద్దెనెక్కాడు. 2008 ఎన్నికలకు పూర్వం వరకూ ఆయన ఏలుబడిలోనే పాక్‌ ప్రజలు ఉన్నారు. సైన్యానికి ఉన్న విశేషాధికారాలతో ప్రజలకు బానిసత్వం తప్పలేదు. ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ వేదిక జోక్యంతో పాకిస్తాన్‌లో 2008లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో ఉన్న పాకిస్తాన్‌ పీపుల్‌ పార్టీ (పీపీపీ) అధినేత్రి దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు అప్పటి సైనిక పాలకుడు ముషారఫే కారణమనే ఆరోపణలూ లేకపోలేదు. బెనజీర్‌ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో పీపీపీ విజయం సాధించింది అధికార పగ్గాలు చేపట్టింది. బెనజీర్‌ భర్త అసిఫ్‌ అలీ జర్దారీ ఆ దేశ అధ్యక్షుడయ్యాడు. 2008 ఎన్నికల్లో 44 శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జర్దారీ చెప్పుచేతల్లో కేంద్రీకృతమైన ప్రభుత్వం ప్రజాస్వామ్య పునర్నిర్మాణానికి అంతగా చర్యలేమి చేపట్టలేదు. భారత్‌తో ఉన్న వివాద పరిష్కారానికి అంతగా ప్రయత్నాలు సాగలేదనే చెప్పాలి. సీమాంతర ఉగ్రవాదం, వాస్తవాధీన రేఖ దాటి పాక్‌ సైన్యం, ఆ దేశ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చిన వివిధ సంస్థలు భారత భూభాగంలో ప్రవేశించి కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చేశాయి. ఈనేపథ్యంలో భారత్‌లోని వివిధ మెట్రో నగరాల్లో బాంబు పేలుళ్లు, విధ్వంస చర్యలకు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదమే కారణమనే ఆరోపణలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2013లో పాకిస్తాన్‌ పార్లమెంట్‌కు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పాక్‌ ఎన్నికల సంఘం ఉపక్రమించింది. అప్పటి వరకూ విదేశాల్లో ఆశ్రయం పొందిన పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) పార్టీ అధ్యక్షుడు నవాజ్‌ షరీఫ్‌ పాకిస్తాన్‌లో అడుగుపెట్టాడు. వస్తూనే ప్రజా సమస్యలపై పోరాటానికి దిగడంతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తున్న పలు సమస్యలకు స్పష్టమైన ముగింపు ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తానని చెప్పుకొచ్చాడు. కార్గిల్‌లో పాక్‌ అక్రమ చొరబాట్లపై అప్పటి సైనిక పాలకుడు ముషారఫ్‌ను విచారిస్తామని, భారత్‌ మైత్రీ పునరుద్ధరణ చర్యలు చేపడుతానని హామీ ఇచ్చాడు. కొన్ని దశాబ్దాలుగా కళ్లోల పరిస్థితులను చవిచూసిన పాక్‌ ప్రజలు నవాజ్‌ మాటలను నమ్మారు. శనివారం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన పార్టీ పీఎంఎల్‌(ఎన్‌)కు పట్టం కట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యా బలాన్ని ఇవ్వకపోయినా పెద్ద సంఖ్యలో(70 మంది) గెలిచిన ఇండిపెండెంట్లు నవాజ్‌తో కలిసే నడిచేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. నవాజ్‌ పగ్గాలు చేపట్టిన వెంటనే ప్రజల సంక్షేమంపై దృష్టి సారించనున్నట్లు ప్రకటించాడు. ఇది నిజంగా పాకిస్తాన్‌ ప్రజలకు శుభవార్తే. ఆసియాలోని అత్యంత సారవంతమైన భూములు, వనరులు ఉన్న భారత్‌, పాకిస్తాన్‌ దయాది దేశాలు. ఒకరిపై ఒకరికి ఆధిపత్యం కోసం తమ దేశ బడ్జెట్‌లో 70 శాతం రక్షణ రంగానికే ఖర్చు చేస్తున్నాయి. ఫలితంగా ఇరుదేశాల్లో పేదరికం పెరిగిపోతూనే ఉంది. ప్రజలకు కనీస సౌకర్యాలు అందడం లేదు. ఇరు దేశాల్లోనూ ద్రవ్యోల్బణం ప్రమాదకర పరిస్థితుల్లో పెరిగిపోయింది. బడ్జెట్‌ కేటాయింపుల్లో సింహభాగం రక్షణ రంగానికే కేటాయించిన పుణ్యమా అని ప్రజలకు కూడు, గూడు, గుడ్డ కరువుతున్నాయి. ఈనేపథ్యంలో ఇరు దేశాల మధ్య స్నేహం చిగురిస్తే అంతకంటే కావాల్సింది ఏముటుంది. ఇరుదేశాల మధ్య రావణ కాష్టంలా కార్చిచ్చు రగిలిస్తున్న కాశ్మీర్‌ సమస్య, సీమాంతర ఉగ్రవాదం తదితర సమస్యలపై సుహృద్భావపూరక వాతావరణంలో చర్చలు జరిపితే కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. భారత్‌-పాకిస్తాన్‌ కలిసిపోవడం పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా సహా పలు దేశాలకు ఇష్టం లేదు. ఆదేశాలు మన మధ్య చిచ్చు రగల్చే ప్రయత్నాలు కొనసాగిస్తాయి. కాస్త అప్రమత్తంగా ఉంటూ భారత్‌-పాకిస్తాన్‌ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండేలా చేయడం కష్టమమే కాదు. ఈ ఎన్నికల్లో నవాజ్‌ షరీఫ్‌ గెలుపుతో అక్కడ ప్రజాస్వామ్యం చిగురిస్తుందనే ఆశాలు మొలకెత్తాయి. కాశ్మీరీలు కూడా స్నేహ హసా