పతకాలతో తిరిగి రండి కర్నూలు
జూలై 27 : ఒలింపిక్‌లో పతకాలు తేవాలని కోరుతూ క్రీడాకారులు శుక్రవారంనాడు ర్యాలీ నిర్వహించారు. లండన్‌లో శుక్రవారంనాడు ప్రారంభమైన 30వ ఒలింపిక్స్‌లో ఇండియా క్రీడాకారులు పతకాలతో తిరిగి రావాలని కోరుతూ నగరంలోని క్రీడాకారులు ర్యాలీ జరిపారు. కర్నూలు జిల్లా అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్తానిక బి క్యాంపులో భారత క్రీడాకారుల ఫొటోలను బేనర్లపై అతికించి ర్యాలీ చేపట్టారు. బెస్ట్ లక్ ఆఫ్ ఇండియా అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్‌బాల్ అసోసియేషన్ పుల్లయ్య, భాషా, విజయకుమార్, సారధ్యంలో ర్యాలీ నిర్వహించారు.