పనికి తగ్గ వేతనం చెల్లించాలని భిక్షాటన

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

-టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు,టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అండగా నిలబడి వారు చేస్తున్న 9వ రోజు దీక్షలకు తెదేపా పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి.సంజయ్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన కాంట్రాక్ట్ కార్మికులతో పాటు భిక్షాటన చేసి, వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం అందించారు. వారు చేసే పోరాటానికి తనవంతుగా సహాయ సహాకారాలు అందిస్తూ, కార్మికుల పోరాటంలో తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఫిబ్రవరి 9వ తేదీ నుంచి హామీలను వెంటనే అమలు చేయాలని, తలపెట్టిన సమ్మె గత 9 రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం గాని, లేబర్ డిపార్ట్మెంట్ గాని సమస్యల పరిష్కారానికి సానుకూలంగా వ్యవహరించకపోవడం సరికాదన్నారు. నేపథ్యంలో సమ్మెను ఉద్రుతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం జె..ఏ.సీ. నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కార దిశగా తక్షణమే అడుగులు వేయాలని, లేదంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సంకే రవి, సీ.ఐ.టీ.యూ, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, ఎండి జాఫర్, లాల్ , టి ఎన్ టి యు సి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.