పాముకాటుతో వ్యక్తి మృతి
ఖమ్మం,నవంబర్7(జనంసాక్షి): గడ్డి కోయడానికి వెళ్లిన వ్యక్తిని పాముకాటు వేయటంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కల్లూరు మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. చెన్నూరు గ్రామానికి చెందిన పప్పుల జమలయ్య(44) గ్రామసవిూప మామిడి తోటలో పశువుల కోసం గడ్డి కోయడానికి వెళ్లాడు. ఈ సమయంలో పాముకాటు వేసింది. సవిూపంలో సవిూప పశువుల కాపరి జయరాజు ఇది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు వైద్యం కోసం కల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్యసాయమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.