పింఛన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్
జనంసాక్షి -రాజంపేట్
పింఛన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్ అని ఎమ్మెల్యే ప్రభుత్వ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని తలమడ్ల ఆరేపల్లి,రాజంపేట్, పెద్దపల్లి గ్రామాలకు సంబంధించిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందేలా కృషి చేస్తుందని ఆయన తెలిపారు. బీడీ పింఛన్లు ఒక నెలలోపు అర్హులందరికీ ఇస్తామని ఆయన వివరించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముసలి, వితంతు, వికలాంగులు,ఒంటరి మహిళలకు, పింఛన్లు ఇస్తున్నామని హాయ్ తెలిపారు. భారతదేశంలో బీడీ కార్మికులు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారని కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికుల పింఛన్లు అందిస్తున్నామని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నూతనంగా 10 లక్షల పింఛన్లు మొత్తంగా 46 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని ఆయన సూచించారు. గుజరాత్ రాష్ట్రంలో 80 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్లు ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో 57 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్లు ఇస్తున్నామని 28 రాష్ట్రాలలో 19 రాష్ట్రాల్లో బిజెపి ముఖ్యమంత్రి ఉన్నారని కేవలం బొంబాయి ,మహారాష్ట్ర లలో వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల స్వరూప, జడ్పిటిసి కొండా హనుమాన్లు, వైస్ ఎంపీపీ దుబ్బాని సావిత్రి, మండల రైతుబంధు కన్వీనర్ జూకంటి మోహన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నల్లవెల్లి అశోక్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల్వంత్ రావు, రాజంపేట్ గ్రామం రైతుబంధు కన్వీనర్ శ్రీరామ్ సురేష్, రాజంపేట్ సర్పంచ్ ఆముద సౌమ్య తలమడ్ల సర్పంచ్ యాదవ్ రెడ్డి పెద్దపల్లి సర్పంచ్ శివలక్ష్మి, ఆరేపల్లి సర్పంచ్ యాదగిరి, ఎక్స్ ఎంపీపీ నీరడి శంకర్, సీనియర్ నాయకులు కమలాకర్ రావు, భూంరావు,పిఎసిఎస్ వైస్ చైర్మన్ రమేష్, ఉప సర్పంచ్ శివ ఆముద నాగరాజ్ గుర్రాల రవి
4 Attachments • Scanned by Gmail