పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలకు టీవీని బహుకరణ
టేకులపల్లి, సెప్టెంబర్ 21( జనం సాక్షి): తమ పిల్లలకు విద్యాబోధన మరింత మెరుగుగా ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు మంచి ఆలోచనతో అందరి సహాయ సహకారాలతో వారి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలకు టీవీని బహుకరించారు. మండల పరిధిలోని ఎంపీపీ ఎస్ ముత్యాలంపాడు( హెచ్ సి) పాఠశాలకు విద్యార్థుల పేరెంట్స్ అందరు కలిసి 43 ఇంచుల టీవీని, స్టెబిలైజర్ను బుధవారం ప్రధానోపాధ్యాయులు లాకావత్ లక్ష్మణ్, ఉపాధ్యాయుడు కే ప్రసాద్ లకు అందజేశారు. పేరెంట్స్ ఔదార్యానికి హెచ్ఎం లక్ష్మణ్ మాట్లాడుతూ పేరెంట్స్ ఈ విధంగా పాఠశాలకు టీవీని బహుకరించడం అభినందనీయమని వారికి ధన్యవాదాలు తెలిపారు. టీవీ ద్వారా విద్యార్థులకు మరింత ఆకట్టుకునే విధంగా విద్యాబోధన చేయవచ్చని, రైమ్స్, పాఠ్యాంశాలు అన్ని సబ్జెక్టులు సంబంధించిన విషయాలను టీవీ ద్వారా మరింత కళ్లకు కట్టినట్టుగా ఈజీగా పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధన చేయవచ్చునని తెలిపారు .ఈ విధంగా విద్యార్థులకు అర్థవంతమైన బోధన చేస్తామని తల్లిదండ్రులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.