ప్రధానోపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి
తాళ్లూరు, జూలై 18 : ప్రధానోపాధ్యాయులు అంకితభావంతో సక్రమంగా విధులు నిర్వహించాలని ఎంఇఓ ఎ కృష్ణకుమారి అన్నారు. మండల కేంద్రమైన తాళ్లూరులోని ఎంఆర్సి భవనం నందు బుధవారం ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంఇఓ కృష్ణకుమారి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి స్థానికుల యొక్క సహకారాన్ని పొందాలని, అప్పుడే పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని ఆమె తెలిపారు. ప్రీస్కూల్ ఏర్పాటు, విద్యాపక్షోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె తెలిపారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతలను ప్రధానోపాధ్యాయులు సక్రమంగా చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిలు పెద్దిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, హజీంబాషా, మండలంలోని యుపి మరియు ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.