ప్రభుత్వ శాఖల అధ్వర్యంలో ఫ్రీడమ్ రన్

జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 10:
చిగురుమామిడి మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు, డాక్టర్లు, రైస్ మిల్లర్ అస్సోషియేషన్, ఆటో డ్రైవర్లలు, స్టూడెంట్స్, యువత అందరు ప్రీడం రన్ లో పాల్గొనాలని స్వాతంత్ర్యo వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అందరికీ స్వతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన రాష్ట్ర ప్రభుత్వం జరుపబోవు వజ్రోత్సవ వారోత్సవాలలో భాగంగా తేదీ 11.08.2022 నాడు అనగా గురువారం ఉదయం 08.00 గంటలకు మన చిగురుమామిడి మండల కేంద్రంలోని పాంబండ హనుమాన్ టెంపుల్ నుండి చిగురుమామిడి బస్టాండ్ లోని అంబేడ్కర్ విగ్రహం వరకు ఫ్రీడం రన్ ను మండల ప్రభుత్వ శాఖల అధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నాము.
అందరూ తప్పనిసరిగా ఇట్టి ఫ్రీడమ్ రన్ లో పాల్గొని విజయవంతం చేయగలరని ఎంపీపీ కొత్త వీనిత శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ ముబిన్ అహ్మద్, ఎంపిడిఓ నర్సయ్య, ఎస్సై సుధాకర్ ఒక ప్రకటనలో కోరారు.