ప్రారంభమైన హెరిటేజ్ క్యాంపెయిన్.

50 మంది వాలంటీర్స్ కు నిపుణులతో నెలాఖరు వరకు శిక్షణ.
కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ.
జ్యోతి ప్రజ్వలన చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య
వెంకటాపూర్(రామప్ప)సెప్టెంబర్19(జనం సాక్షి):-
భారత పురావస్తు శాఖ,తెలంగాణ పర్యాటక శాఖ,యునెస్కో ఇండియా,కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మంది వాలంటీర్స్ కు నిర్వహించే వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ అదిత్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.సోమవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ ప్రాంగణంలో  నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటక వారసత్వ కట్టడాలపై భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించే హెరిటేజ్ క్యాంపెయిన్ లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 42 మంది యువతి యువకులతో పాటు 8 మంది విదేశీయులు హెరిటేజ్ క్యాంపెయిన్ లో శిక్షణ పొందేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు.
రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి 12 సంవత్సరాలుగా ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు ఎంతో కృషి చేశారని అన్నారు.ప్రస్తుతం 12 రోజులపాటు ఏర్పాటుచేసిన హెరిటేజ్ క్యాంపెయిన్ లో వాలంటీర్ల కు శిక్షణను అందించేందుకు 28 మంది నిపుణులను నియమించిన నియమించినట్లు తెలిపారు. అటవీ ప్రాంతం అధికంగా ఉన్న ములుగు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు కావలసిన అన్ని అవసరాలను అందిస్తున్నామని తెలిపారు. వాలంటీర్లకు రామప్ప నిర్మాణ శైలి వినియోగించిన వస్తువులు ఇంజనీరింగ్ టెక్నాలజీ కలలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.వారసత్వ కట్టడాల అభివృద్ధి వంటి అంశాలతో అనుభవజ్ఞులైన నిపుణులచే అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాష్ రావు,జె. శ్రీధర్ రావు,ధర్మకర్త, కాకతీయ హెరిటేజ్ ట్రస్టీ, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్య కిరణ్, పురావస్తు శాఖ సిఏ మల్లేష్,గార్డెన్ పోర్ మెన్ పదీప్ బాబు స్థానిక పాఠశాల ఉపధ్యాయులు,అధికారులు వాలంటీర్లు పాల్గొన్నారు.