ఫైనల్ బెర్త్ ఎవరిదో… నేడు రెండో క్వాలిఫైయర్ లో ముంబై , రాజస్థాన్ ఢీ
కోల్‌కత్తా ,మే 23 (జనంసాక్షి):ఐపీఎల్ ఆరోసీజన్‌లో మిగిలిన ఒక ఫైనల్ బెర్త్ కోసం ఆసక్తికరమైన మ్యాచ్ నేడు జరగబోతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్ , రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఇప్ప టి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ముంబై రాజస్థాన్‌కు చెక్ పెట్టి చెన్నైతో టైటిల్ పోరులో తలపడాలని భావిస్తోంది. మొదటి క్వాలిఫైయర్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేేతిలో చిత్తుగా ఓడినప్పటకీ… ముంబైని తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్ పరంగానూ , బౌలిం గ్‌లోనూ ఆ జట్టు స్టార్ ప్లేయర్ ్సతో పటిష్టంగా ఉంది. ముఖ్యంగా బ్యాటిం గ్‌లో డ్వయాన్ స్మిత్ , రోహి’శర్మ , దినేష్‌కార్తీక్ , అంబటి రాయులు లాం టి హిట్టర్లు ఉండడం వారికి అడ్వాంటేజ్. చివర్లో పొల్లార్డ్ మెరుపులు కూడా తోడైతే భారీస్కోర్ ఖాయం. గత మ్యాచ్ లో చెన్నైపై స్మిత్ తప్పించి మిగిలిన వారు విఫలమ య్యారు. అయితే రాజస్థాన్‌పై కీలక మ్యాచ్ కావడంతో అందరూ సమిష్టిగా రాణించాలని ఆ జట్టు భావిస్తోంది.
సచిన్ టెండూల్కం గాయం కారణంగా ఆడే అవకాశాలు లేకపోవడంతో యువక్రికెటర్ ఆదిత్య తారేకు చోటు దక్కనుంది. బౌలింగ్ లో మాత్రం ముంబై రాజస్థాన్ కంటే పటిష్టంగా కనిపిస్తోంది. మిఛెల్ జాన్సన్ , లసి’ మలింగాకు తోడుగా పొల్లార్డ్ కూడా రాణిస్తున్నాడు. స్పిన్ విభాగంలో హర్భజన్ , ఓజా ద్వయం సపోర్ట్ ఇస్తుం డడంతో వారికి ఇబ్బందులు లేవనే చెప్పాలి. సాధారణంగా సీమర్లకు అనుకూ లించే ఈడెన్ పిచ్ పై జాన్సన్ , మలింగా లాంటి స్టార్ బౌలింగ్ ను ఎదుర్కోవడం రాజస్థాన్‌కు కష్టమని భావిస్తున్నారు. మరోవైపు స్పాట్‌ప ిక్సింగ్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైనప్ప టకీ… ఎలిమినేటం మ్యాచ్‌లో రాజ స్థాన్ రాయల్స్ మంచి ప్రదర్శనే కనబరిచింది. 133 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో తడబడినప్పటకీ… హడ్జ్ లాంటి టీ ట్వంటీ స్పెషలిస్ట్ బ్యాటింగ్ తో విక్టరీ కొట్టింది. అయినప్పటకీ రాజస్థాన్ బ్యాటింగ్ లో ద్రావిడ్ , రహానేలు మంచి ఆరంభాన్నిస్తుండగా… వాట్సన్ , సంజా శాంసన్ , స్టు వ్టం బిన్నీ లాంటి క్రికెటర్లతో నిలకడగానే ఉంది. అటు బౌలింగ్‌లో మాత్రం రాయల్స్ అద్భుతంగా ఆడుతోంది. గత మ్యాకలో రైజ్సంపై ఆ జట్టు బౌలర్లు చక్కని లైన్ అంా లెంత్‌తో తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు. కూపం , త్రివేదీ , బిన్నీ కలిసికట్టుగా రాణిస్తూ ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరుస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉండడంతో వీరి ఎంతవరకూ గత ప్రదర్శనను రిపీట్ చేస్తారనేది ఆసక్తికరమైన అంశం. స్టాం క్రికెటర్లు ఎక్కువగా లేకున్నా యువఆటగాళ్ళ ప్రతిభతో విజయాలు సాధిస్తూ సెవిూస్ వరకూ చేరుకున్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే వారికి అన్నివిధాలా ప్రయోజనముంటుంది. ఫిక్సింగ్‌త ఆరోపణల నడుమ పట్టుదలతో ఆడడం ద్వారా తమను తాము నిరూపించుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌నే ఫేవరెట్‌గా భావిస్తున్నప్పటకీ… షార్ట్ ఫార్మేట్‌లో చివరి బంతి వరకూ ఏం జరుగుతుందనేది అంచనా వేయడం కష్టం. దీంతో రెండో క్వాలిఫైయం కూడా అభిమానులకు టీ ట్వంటీ మజా అందిస్తుందని భావిస్తున్నారు.