బండనాగారం అంగన్వాడి cకేంద్రంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు…

…. సిడిపిఓ రమాదేవి
బచ్చన్నపేట సెప్టెంబర్ 21 (జనం సాక్షి) సెక్టర్ లెవెల్ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా బుధవారం బండనాగారం గ్రామంలోని అంగన్వాడి సెంటర్లో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం జరిగిందని సిడిపిఓ రమాదేవి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు పోషకాహారం పై అవగాహన కల్పించడం జరిగిందని. రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు నష్టాల గురించి చెప్పడం జరిగిందని అనంతరం బండ నాగారం సర్పంచ్ శివరాత్రి కవిత ముఖ్యఅతిథిగా పాల్గొనగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం జరిగిందని ఆమె తెలిపారు. గర్భిణీ స్త్రీలు మాట్లాడుతూ మా ఇళ్ళల్లో జరుపుకునే శ్రీమంత సంబురాలను అంగన్వాడి కేంద్రంలో జరుపుకోవాలని మాకు చాలా సంతోషంగా ఉన్నదని గర్భిణీలు ఆనందం వ్యక్తపరిచారు. ఈ శ్రీమంతం కార్యక్రమాలకు ఏఎన్ఎం ప్రణీత. ఆశ కార్యకర్త అనిత తమ సొంత డబ్బులతో చీరలు బహుకరించినందుకు అంగన్వాడి టీచర్లు వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు. బందారం లక్ష్మయ్య. అంగన్వాడి సూపర్వైజర్ పద్మ. పలు గ్రామాల అంగన్వాడి టీచర్లు. ఆశా కార్యకర్తలు. గర్భిణీలు. బాలింతలు. గ్రామస్తులు పాల్గొన్నారు