బడినుంచే పౌరహక్కులపై పాఠాలు

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి సూచన   ఢిల్లీ: డిసెంబర్‌ 10, (జనంసాక్షి): దేశంలో పాఠశాల స్థాయిలోనే పిల్లలకకు మానవహక్కుల అంశంపై అవగాహన కల్పించాల్సి ఉందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభిప్రా యపడ్డారు. దీనిని ఒక బోధనాంశంగా ప్రవేశపెటి పాఠ్యాంశాలను రూపోం దించి చిన్నతనం నుంచే వారికి బోదిస్తే మంచిదని పేర్కొన్నారు. సోమవారం మానవహక్కుల దినోత్సవం సంద ర్భంగా జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన     ప్రసంగించారు. నిజానికి స్వాతంత్య్రనికి ముందు  కూడా దేశంలో మానవహక్కుల పరిరక్షణ ఎంతో చక్కగా ఉండేదని పేర్కిన్నారు.  చెప్పాలంటే మన జాతిపతిత మహాత్మాగాంధీయే ప్రపంచస్థాయిలో మానవహక్కుల ఉద్యమకారుడని అభివర్ణించారు. 1948లో ఐక్యరాజ్య సమితి మానవహక్కులపై ప్రకటన రూపోందించింనప్పుడు ఆయన ఆదర్శాలను, సూత్రాలను కూడా ప్రాతిపాదికగా తీసుకుందన్నారు.  ప్రస్తుతం మనదేశంలో ఎంతో గొప్పదైన రాజ్యాంగం, కీలకమైన చట్టాలు, పటిష్టమైన పోలీసువ్యవస్థ వంటివి ఉన్నా అవగాహనరాహిత్యం కారణంగా మానవహక్కులపై అంతగా పట్టింపు లేకుండా పోతుందన్నారు.  ఈ పరిస్థితిలో మార్పు రావాలని, పిల్లలకు కూడా చిన్నతనం నుంచే దీనిపై అవగాహన పెంపొందించాలని రాష్ట్రపతి సూచించారు.