హర్యానాలో భాజాపా హ్యాట్రిక్
` 48 స్థానాలలో బీజేపీ గెలుపు
` 37 సీట్లు కైవసం చేసుకున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్
` ఐఎన్‌ఎల్‌డీ రెండు స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో విజయం
చండీగడ్(జనంసాక్షి):హరియాణాలో మరోసారి కమలం విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కుంచుకుంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు గానూ 48 స్థానాలు గెలుచుకొని బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ 37 సీట్లు కైవసం చేసుకుంది. ఐఎన్‌ఎల్‌డీ రెండు స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతానే తెరవలేదు. కౌంటింగ్ ఆరంభంలో ముందంజలో ఉన్న కాంగ్రెస్, కొద్దిసేపటికే రెండో స్థానానికే పరిమితమైంది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ఫలితాలు మొత్తం తారుమారు అయ్యాయి. పదేళ్ల పాలనలో బీజేపీపై నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, రైతు చట్టాల నిరసనలు, రెజర్ల ఆందోళనలు, జాట్?ల అసంతృప్తి వంటి అంశాలు రాజకీయ అస్త్రాలుగా మారినా` అవి కాంగ్రెస్?ను గెలుపు దిశగా నడిపించలేకపోయాయి. జాట్‌లు, ఎస్‌సీ ఓటర్లు 40శాతం ఉన్నా, కాంగ్రెస్‌కు కలిసిరాలేదు. రైతులకు కనీస మద్దతు ధర వంటి ఏడు గ్యారంటీలతో వరాలు జల్లు కురిపించినా ఆశించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఎలాగైనా అధికారం చేపట్టాలని భావించిన కాంగ్రెస్?కు ఓటమి తప్పలేదు. కానీ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది.
(100 గ్రా॥లతో పతకం తప్పినా..
ప్రజాక్షేత్రంలో ఘనవిజయం
` హరియాణా ఎన్నికల్లో వినేశ్ ఫోగట్ సంచలన విజయం
` జులానా నుంచి 4వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపు
` ప్రజల ప్రేమ ఫలితాల్లో కనిపించింది
` ఇది ప్రజల పోరాటం ..అందులో వారు గెలిచారు
` నేను వారి ప్రతినిధిని మాత్రమే.
` విజయం అనంతరం వినేశ్ వ్యాఖ్యలు
చండీగడ్(జనంసాక్షి):కుస్తీ యోధురాలు, కాంగ్రెస్ నాయకురాలు వినేశ్ ఫొగాట్ హరియాణా ఎన్నికల్లో విజయం సాధించారు.జులానా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పారిస్ ఒలింపిక్స్ వేదికగా తృటిలో పతకాన్ని చేజార్చుకున్న ఆమె.. ఎన్నికల సమరంలో మాత్రం ఓటమిని దరి చేరనివ్వలేదు. ఈ స్థానంలో బరిలో నిలిచిన భాజపా అభ్యర్థి యోగేశ్ కుమార్, ఆప్ అభ్యర్థి కవితా రాణి ఆమె చేతిలో పరాజయం పాలయ్యారు. గెలుపు అనంతరం వినేశ్ విూడియాతో మాట్లాడారు. ‘’ప్రజల ప్రేమ ఫలితాల్లో కనిపించింది. ఇది ప్రజల పోరాటం. అందులో వారు గెలిచారు. నేను వారి ప్రతినిధిని మాత్రమే. రాబోయే ఐదేళ్లపాటు ప్రజల అంచనాలు అందుకోవడానికి కృషి చేస్తా. ఈ దేశం నాకు ఇచ్చిన ప్రేమ, నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’’ అని తెలిపారు.వినేశ్ విజయంపై రెజ్లర్ బజరంగ్ పునియా అభినందనలు తెలుపుతూ పోస్టు పెట్టారు. ‘’విజయం సాధించిన భారత పుత్రిక వినేశ్ ఫొగాట్‌కు అభినందనలు. ఇది జులానా సీటుకు సంబంధించిన పోటీ కాదు. అలాగే ఏదో మూడు నాలుగు స్థానాలు, పార్టీల మధ్య పోరు అసలే కాదు. ఈ పోరు బలమైన అణచివేత శక్తుల మధ్య జరిగింది. అందులో వినేశ్ గెలిచింది’’ అని ఆమె ఫొటోను షేర్ చేశారు. తన సవిూప భాజపా ప్రత్యర్థిపై ఆరువేల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. అక్టోబర్ 5న హరియాణాలో ఎన్నికలు జరగ్గా.. ఈ రోజు ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ రాష్ట్రంలో భాజపా మూడోసారి అధికారాన్ని చేపట్టే దిశగా పయనిస్తోంది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించినా.. తర్వాత కమలం దాటికి నిలవలేక రెండో స్థానానికి పరిమితమైంది.ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌లో వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఖాళీ చేతులతో ఆమె స్వదేశానికి చేరుకోవాల్సి వచ్చింది. ఆ పరిణామం యావత్ భారతావనిని బాధించింది. అనంతరం భవిష్యత్ కార్యాచరణనను ప్రకటించిన ఆమె కాంగ్రెస్‌లో చేరి రాజకీయ ప్రయాణాన్ని ఆరంభించింది.
హరియాణా సీఎంగా ‘నాయబ్’ !
` అతడి వైపే భాజపా మొగ్గు..!
చండీగడ్(జనంసాక్షి):హరియాణా లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. ఎన్నికల ఫలితాల్లో భాజపా దూసుకెళ్లింది మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన కాషాయ పార్టీ.. ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై కసరత్తు మెదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సారి కూడా నాయబ్ సింగ్ సైనీనే హరియాణా సీఎంగా కొనసాగనున్నట్లు సమాచారం. ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు భాజపా వర్గాలు వెల్లడిరచాయి. హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలుండగా.. ఇప్పటివరకు జరిగిన లెక్కింపుల్లో భాజపా మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. 49 చోట్ల కాషాయ పార్టీ విజయం సాధించగా.. 36 స్థానాలను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. సీఎం నాయబ్ సింగ్ నేతృత్వంలో హరియాణాలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు భాజపా సిద్ధమైంది. రాష్ట్రంలో విజయం సాధించినందుకు ప్రధాని మోదీ.. నాయబ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు సైనీ అత్యంత సన్నిహితుడు. ఓబీసీ వర్గానికి చెందిన సైనీ 1996లో భాజపాలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పార్టీలో పలు పదవులు చేపట్టారు. 2014లో నారాయణ్‌గఢ్ నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబరులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనంతరం సీఎంగా పగ్గాలు స్వీకరించారు.