బిజెపి నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి

నీతి ఆయోగ్‌ ఏర్పాటుతో రాష్టాల్రకు  కష్టాలు తప్పులాయని అంతా భావించారు. కేంద్రాన్ని దేబిరించే పరిస్థితి ఉండదనుకున్నారు. తరచూ ఢిల్లీకి వెళ్లే ఆగత్యం ఉండదనకున్నారు. రాష్టాల్రను సమానంగా అభివృద్ది చేసేందుకు పారదర్శకత పాటిస్తారని అనుకున్నారు. కానీ నీతి ఆయోగ్‌ ఏర్పాటు తరవాత కూడా రాష్టాల్ర పరిస్థితులు మారలేదు. కొత్త ఒరవడి సృష్టిస్తారని, బిజెపి చాలా డిఫరెంట్‌గా ఉంటుందని అంతా భావించారు. మోడీ ప్రధాని అయితే గత కాంగ్రెస్‌ విధానాలకు స్వస్తి చెబుతారని అనుకున్నా నీ అలా జరగడం లేదు. రాష్టాల్ల్రో వేలు పెట్టడం కేంద్రం మానుకోలేదు. ఉత్తరాఖండ్‌ వ్యవహారమే తీసుకుంటే బిజెపి తలబొప్పి కట్టినా పాశ్చాత్తాపం చెందినట్లు కనిపించడం లేదు. అక్కడ రావత్‌ సర్కార్‌ను కూలదోసే ప్రయత్నాల్లో భాగగంఆ అనుసరించిన తీరు కాంగ్రెస్‌ కన్నా అధ్వాన్నంగా ఉన్నాయి. అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం, హైకోర్టు తిరస్కరించడం, సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం, తిరిగి విశ్వాస పరీక్ష జరపడం చూస్తుంటే బిజెపి తనవేలుతో తన కన్నునే పొడుచుకున్న రీతిగా ఉంది. ఇది రాజకీయాల్లో జుప్స కలిగించే విధంగా ఉంది. చివరి వరకు సాగిన డ్రామా అంతా దారుణంగా ఉంది. మొత్తంగా కాంగ్రెస్‌కన్న బిజెపి భిన్నం కాదని నిరూపించుకున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం చట్టుబండలు కావడం వల్ల్నే ఉత్తరాఖండ్‌ వ్యవహారం ఎదురుతిరిగిందని చెప్పాలి. చివరకు తేల్చిందేమంటే స్పీకర్‌ పాత్రపై సవిూక్షించాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విశ్లేషించారు.  ప్రభుత్వ ఆధిక్యంపై విశ్వాసాన్ని పరీక్షించడంలో, పార్టీ ఫిరాయింపు చట్ట నిబంధనలను అమలు పరచడంలో సభాపతి పాత్రను పునఃసవిూక్షించాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. దీనిపై దేశవ్యాప్త చర్చ జరగాలన్నారు. పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద కేసుల్ని నిర్ణయించడానికి నిర్ణీత కాలపరిమితి ఉండాల్సిందేనని చెప్పారు. ఉత్తరాఖండ్‌ వ్యవహారాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ తరఫున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మరో పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటే ముందుగా ఆ పదవికి రాజీనామా చేసి, మళ్లీ ప్రజాతీర్పు కోరాలని చెప్పారు. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా రాజ్యాంగ స్ఫూర్తితో ముందుగా రాజీనామా చేయాలన్నారు. ఒక ప్రజా ప్రతినిధి వేరే పార్టీకి విధేయత వ్యక్తం చేస్తే తక్షణం అనర్హత వేటు వేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు.  అయితే  ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంలో కేంద్రం ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. నిజాంగా ఉభయ తెలుగు రాష్టాల్ల్రో ఇప్టపివరకు జరిగిన ఫిరాయింపులు వెంకయ్యకు తెలియనివి కావు. కానీరాజ్యాంగ బద్దంగా నడుచుకునేలా వ్యవహరించడంలో బిజెపి విఫలమయ్యిందనే చెప్పాలి. బిజెపి ప్రభుత్వం నిక్కచ్చిగా ఉండివుంటే రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగేవి కావు. నీతి ఆయోగ్‌ ఏర్పాటు సందర్భంగా మోడీ మాట్లాడినతీరు చూస్తే రాష్టాల్రు బలోపేతం అవుతాయనుకున్నారు. కొత్త ఒరవడి వస్తుందని భావించారు. కానీ అలా రగలేదనడానికి ఉత్తరాఖండ్‌తో పాటు తెలుగు రాష్టాల్ల్రో అనుసరిస్తున్న తీరే కారణం. ప్రధాని మోడీ ప్రవచించిన ఉమ్మడి బాధ్యతలు, నిర్వహణ తదితర అంశాలు కానరావడం లేదనడానికి రాష్టాల్ర పట్ల అనుసరిస్‌ఉతన్న వైఖరి నిదర్శనంగా చెప్పుకోవాలి. బడ్జెట్‌ కేటాయింపులు మొదలు, హావిూల అమలు వరకు  రాష్టాల్రను బలోపేతం  చేస్తేనే దేశం బలోపేతం అవుతుంది. అందులో భాగంగా ఆయా రాష్టాల్ర అవసరాల మేరకు కేంద్రం నిధులు వెచ్చించి ప్రోత్సహించాలి. కలసి సాగుదాం అన్న మోడీ సూత్రానికి భిన్నంగా నిర్ణయాలు ఉండరాదు. తెలంగాణకు నిధులు ఇవ్వడంలోనూ ఎపిని ఆర్థికంగా ఆదుకోవడంలోనూ పెద్దగా ప్రభాఇతం చేసేలా నిర్ణయాలు లేవు. ప్రత్యేక¬దాపైనా కప్పదాటు వ్యవహారాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో నిర్మొహమాటంగా ఉండాలి. ఏ రాష్టాన్రికి నిధులు ఇచ్చినా అవి దేశ అభివృద్దిలో భాగమనే భావన ఉండాలి. కేంద్రం అంటే బ్రహ్మపదార్థంగా ఉండరాదు. ఈ దశలో కేంద్ర రాష్టాల్ర పరిధులపై చర్చ సాగాలి. ఉత్తరాఖండ్‌ లాగా ఏ రాష్ట్రం కూడా కేంద్ర వివక్షకు గురికారాదు. రాష్టాల్రు బలోపేతం అయితేనే కేంద్రం ఉంటుందని లేకుంటే మిథ్య కాగలదని గుర్తించాలి. రాజకీయాలకు బిజెపికొత్త నిర్వచనం ఇవ్వాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి. ఫిరాయింపులపై ఖచ్చితత్వాన్ని పాటించాలి. అవసరమైతే పార్లమెంటులో చర్చచేసి దీనిని పునఃసవిూక్ష చేయాలి. చెప్పింది కేంద్రమంత్రే గనుక ఆ దిశగా అడుగులు పడాలి. ఉత్తరాఖండ్‌లో దొడ్డిదారిన తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన బిజెపికి భంగపాటు ఎదురైందన్న విషయాన్ని గుర్తించిఆత్మవిమర్శ చేసుకోవాలి. ఉత్తరాఖండ్‌లో దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ అధినేతలు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను మనుగడ సాగించనీయకుండా అడుగడుగునా అడ్డుతగిలి, ఆ ప్రభుత్వాన్ని కూల్చి వేసి, తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గతంలో కాంగ్రెస్‌ ప్రయత్నించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆ ఒరవడిలోనే బిజెపి సాగడం సరికాదు.