ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి..

` 14 మంది మృతి
కీవ్‌(జనంసాక్షి):ఒకవైపు ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మరోవైపు రష్యా- ఉక్రెయిన్‌ (%Rబంంఱa- ఖసతీaఱఅ%)ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.కీవ్‌పై మాస్కో భీకర క్షిపణి దాడులకు పాల్పడుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై జరిగిన దాడుల్లో 14మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మందికి పైగా పౌరులు తీవ్ర గాయాలపాలైనట్లు అధికారులు పేర్కొన్నారు. కీవ్‌ సైనిక పరిపాలన అధిపతి తైమూర్‌ ట్కాచెంకో మాట్లాడుతూ రష్యా దాడిలో కీవ్‌లోని డజన్లకొద్దీ అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇప్పటికే 14 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు.భవనాల శిథిలాల కింద అనేకమంది ప్రజలు చిక్కుకున్నారని.. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఘటనా స్థలాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ దాడిలో ఓ అమెరికా పౌరుడు కూడా మరణించినట్లు వెల్లడిరచారు. రష్యా ప్రయోగించిన పలు డ్రోన్లను ఉక్రెయిన్‌ వైమానిక రక్షణ దళాలు కూల్చివేసినట్లు ఆయన తెలిపారు. అయితే డ్రోన్ల శిథిలాలు పడడంతో కీవ్‌లోని పలు ప్రాంతాల్లో మంటలు చెలరేగాయన్నారు. కాగా కెనడాలో జరుగుతున్న ‘’జీ7 సదస్సు’’ (%G7 ూబఎఎఱ్‌%)కు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హాజరవ్వనున్నారు.కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు జరుగుతున్న వేళ రష్యా వరుసగా ఉక్రెయిన్‌పై అతిపెద్ద వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఇటీవల ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా 367 డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా 69 క్షిపణులు, 298 డ్రోన్లను ప్రయోగించినట్లు వెల్లడిరచారు. ఈ దాడుల్లో 80 నివాస భవనాలు సైతం ధ్వంసమయ్యాయి. ఇరాన్‌ రూపొందించిన షాహెద్‌ డ్రోన్లను ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించినట్లు అధికారులు పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపడానికి రష్యాపై ఒత్తిడి పెంచాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా, పశ్చిమదేశాలను కోరారు.