బిపిఎల్‌లో పాక్‌ ప్లేయర్లు ఆడడంపై సందిగ్థత

ఎన్‌వోసి ఇవ్వని పాక్‌ క్రికెట్‌ బోర్డు

ఢాకా, డిసెంబర్‌ 15: వచ్చే ఏడాది జరిగే బంగ్లా దేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌లో పాకిస్థాన్‌ ఆటగాళ్ళు ఆడడంపై సందిగ్ధత కొనసాగుతోంది. డెడ్‌లైన్‌ పూర్తైనా పిసిబీ తమ ఆటగాళ్ళకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ ఇవ్వక పోవ డమే దీనికి కారణం. బిపిఎల్‌ సెకండ్‌ సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల జాబితా సమర్పించేందుకు గడువు రెండురోజుల క్రితమే ముగిసినా పిసిబీ నుండి ఎటుంవంటి స్పందనా లేకపోవడంతో పాక్‌ క్రికెటర్ల ఆడడంపై గందరగోళం నెలకొంది. దీనిపై బంగ్లా క్రికెట్‌ బోర్డు పిసిబీ వర్గాలను సంప్రదిస్తే తాము వేరే పనుల్లో బిజీగా ఉన్నామని సమా ధానం వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే వారం భారత పర్యటన పనుల ఒత్తిడిలో ఉన్నట్టు పిసిబీ అధికారులు తమకు తెలిపినట్టు బిసిబి వెల్లడిం చింది. అయినప్పటకీ త్వరలోనే బిపిఎల్‌లో తమ ఆటగాళ్ళు ఆడడంపై పాలసీ డెసిషన్‌ తీసుకుంటామని పాక్‌ క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు చెప్పారు. అయితే బంగ్లాదేశ్‌ జట్టు తమ పర్యటనకు రాకపోవడం, బిపిఎల్‌ ఫ్రాంచైజీలు చెల్లింపులు విషయంలో సరిగా వ్యవహరించ కపోవడమే పిసిబీ ఆలస్యానికి కారణమని సమా చారం. బంగ్లా క్రికెట్‌ బోర్డు పాక్‌ పర్యటనకు అంగీకరిస్తేనే తమ ఆటగాళ్లను బిపిఎల్‌లో ఆడించాలని పిసిబీ భావిస్తోంది. దీనిపై బిసిబి ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ సెకండ్‌ సీజన్‌ ఆటగాళ్ల వేలం డిసెంబర్‌ 20న జరగనుంది. బంగ్లా, విండీస్‌ సిరీస్‌ షెడ్యూల్‌తో పలుసార్లు వాయిదా పడిన ఈ ఆక్షన్‌ 20న జరిపేందుకు బిసిబి నిర్ణయిం చింది. అలాగే జనవరి 18 నుండి సీజన్‌ మొదలవ నుండగా టోర్నీకి ఇబ్బంది లేకుండా ఓపెనింగ్‌ సెర్మనీని ఒకరోజు ముందుగానే నిర్వహించాలని నిర్ణయించారు.