బేడ(బుడగ)జంగం కులాన్ని అన్నిరంగాల్లో ఎదిగేలా ప్రోత్సహిస్తాం
-రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
తోర్రుర్ 13 ఆగస్టు (జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బేడ(బుడగ)జంగం కులానికి చేయుతనిస్తూ వారిని అన్నిరంగాల్లో ఎదిగేలా ప్రోత్సహిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.నేషనల్ బేడ(బుడగ)జంగం రిజర్వేషన్ పోరాట సమైఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు,చైర్మన్ పస్తం సైదులు శనివారం హన్మకొండ లోని ఆర్&బి గెస్ట్ హౌస్ లోని మంత్రి కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.సామాజికంగా, ఆర్ధికంగా, వెనుకబడిన బేడ(బుడగ)జంగం కుల సమగ్రాభివృద్ధికి అండగా ఉంటామన్నారు.అదేవిధంగా బేడ(బుడగ)జంగం కులస్తులకు దళిత బందు సంక్షేమ పథకం అందేలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.అనంతరం పస్తం సైదులు మాట్లాడుతూ.మంత్రి దయన్న పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని బేడ(బుడగ)జంగం కులస్తులకు అన్నివేళలా అండగా ఉన్నారన్నారు.దయన్న నాయకత్వం లో బేడ(బుడగ)జంగం కులస్థులందరం కలిసి కట్టుగా ముందుకెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ బేడ(బుడగ)జంగం రిజర్వేషన్ పోరాట సమైఖ్య ఉపాధ్యక్షుడు కిన్నెర చిన్న గురవయ్య, జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాస్, దంతాలపల్లి మండల ఉపాధ్యక్షుడు నర్కూటీ రామరాజు,వీరనరసింహ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పస్తం సాంబ,కర్కాల గ్రామ అధ్యక్షుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
