భారత వజ్రోత్సవల్లో భాగంగా 2 కే ఫ్రీడం రన్ విజయవంతం

*జెండా ఊపి రన్ ను ప్రారంభించిన ఎంపీపీ సంధ్య తిరుపతయ్య యాదవ్*
*గోపాల్ పేట్ జనం సాక్షి,ఆగస్టు 11:*
 భారతదేశానికి స్వాతంత్రం సిద్దించి 75 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవాల పేరిట ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తుంది . అందులో భాగంగా గురువారం గోపాల్ పేట్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ వారు నిర్వహించిన 2కె ఫ్రీడం రన్ విజయవంతమైనట్లు ఎస్ఐ నవీద్ తెలిపారు. ఈ కార్యక్రమం తెలుగు తల్లి చౌరస్తాలో ఎంపీపీ సంధ్య తిరుపతయ్య యాదవ్ జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. తెలుగు తల్లి చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు 2కె రన్ నిర్వహించారు. అనంతరంస్థానిక ఎస్సై, మండల ప్రజా ప్రతినిధులు బస్టాండ్ లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్సై నవీద్ మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా 2కె రన్ కొనసాగింది అని స్వాతంత్ర్య పోరాట యోధులను గుర్తుచేసుకుంటూ ఈ వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర పోరాట యోధుల స్పూర్తిని గుర్తు చేస్తూ విద్యార్ధుల్లోనే కాదు ప్రజలందరిలో దేశభక్తి పెంపొందించేందుకు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ, స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుతున్నట్లు తెలిపారు.ప్రజలు జెండాను చేతపట్టి భారీగా ఫ్రీడం రన్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భార్గవి, వైస్ ఎంపీపీ చంద్ర శేఖర్ , కోఆప్షన్ సభ్యులు మతీన్, ఎంపీడీవో హూసేనప్పా , ఎమ్మార్వో సునీత, డిప్యూటీ ఎమ్మార్వో జాకీర్ హుస్సేన్, పి హెచ్ సి మంజుల, గోపాల్ పేట్ సర్పంచ్ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి లు, అన్ని శాఖల అధికారులు, విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.