మండల సాధన రిలే నిరాహార దీక్షకు జర్నలిస్టు అసోసియేషన్ సంఘీభావం
రాజాపేట. జనం సాక్షి
రఘునాధపురం మేజర్ పంచాయితీని మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు గురువారం పొట్టిమర్రి చౌరస్తా వద్ద 2వ రోజు చేపట్టిన రిలే దీక్షలకు రాజపేట మండల జర్నలిస్ట్ అసోసియేషన్ సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ…. రఘునాథపురం గ్రామ పంచాయతీని మండలంగా ఏర్పాటు చేస్తే ప్రజలకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రఘునాధపురం పరిసర గ్రామాలైన 13 గ్రామపంచాయతీల ప్రజలకు అందుబాటులో సౌకర్యంగా ఉంటుందని
అన్నారు. ప్రజా సమస్యలు దృష్టిలో ఉంచుకొని మండల కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చామకూర గోపాల్ గౌడ్, మాజీ ఎంపీపీ వంచ వీరారెడ్డి, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చిగుళ్ల లింగం, జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఉప్పల రమేష్, కోశాధికారి కనకుంట్ల శేఖర్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.