. మన జెండా ఎగురంగా.. మనసంతా మరువంగా..
రాజన్న సిరిసిల్ల బ్యూరో ఆగస్టు 11.(జనం సాక్షి.) భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై జిల్లా అధికారి సంఘం చేస్తున్న కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు జరుపుకోవాలని తెలిపిన విషయం తెలిసింది. దానికి అనుగుణంగా జిల్లాలో ప్రత్యక్షంగా ప్రజలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆ దిశగా అధికారులు ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలను చేపట్టారు. గుండె నిండా జాతీయ భవనం నింపుకున్న కొనరో పేట్ మండలం సుద్దల గ్రామానికి చెందిన కురువృద్ధుడు దేవయ్య తన ఇంటి ముందు గురువారం పందిరికి జాతీయ జెండాను కట్టి వినమ్రంగా ఆనాడు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను పునప్రాయంగా అర్పించిన నాయకులను గుర్తుచేసుకున్నాదు. ఇటీవల ఇంటిముందు పనులు చేస్తుండగా జారి పడడంతో కాలికి గాయాలైన లెక్కచేయకుండా ఇంటి ముందు జెండా కట్టిన దేవయ్య ఇప్పుడు ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.