మహిళలకు ప్రోత్సాహం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్.

– టీఆర్ఎస్ పార్టీ మహిళ విభాగం అధ్యక్షురాలు కాసు లావణ్య.
– కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టిన మహిళ శ్రేణులు.
– విద్యార్థులకు వ్యాసరచన పోటీలు.
కరకగూడెం,మార్చి06(జనం సాక్షి):
తెలంగాణ రాష్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ మహిళలను గుర్తించి, ప్రోత్సాహం అందిస్తున్నారని కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ మహిళ విభాగం అధ్యక్షురాలు కాసు లావణ్య అన్నారు.
ఆదివారం స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవ పురస్కరించుకొని మహిళ బంధు సంబరాలలో భాగంగా పార్టీ మహిళల శ్రేణులు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు.మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి,కరపత్రాలను ఇంటింటింకి వెళ్లి పంచారు.అనంతరం కస్తూరిబా బాలికల పాఠశాల నందు మహిళ విభాగం అధ్యక్షురాలు కాసు లావణ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘సమాజంలో మహిళల పాత్ర,రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత,సంక్షేమ పథకాల గురించి’వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక,ఎంపీటిసి సభ్యురాలు ఎలిపెద్ది శైలజ,
సర్పంచులు జవ్వాజి రాధ,తాటి సరోజిని,పోలెబోయిన పాపక్క,తోలెం సావిత్రి,ఆరెం సాంబ,భూక్య భాగ్యలక్ష్మి,ఉప సర్పంచులు తునికి మౌనిక,ఎర్ర శైలజ,మండల మహిళ నాయకులు కమ్రున్,రమాదేవి,విజయ,జ్యోతి,కృష్ణకుమారి,
సరస్వతి,మహేశ్వరి,పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,ప్రధాన కార్యదర్శి బుడగం రాము,కొమరం రాంబాబు,పెద్ద రామలింగం,కనకయ్య,జాడి రామనాధం, సర్పంచులు పాయం నరసింహరావు, పోలెబోయిన నరసింహరావు, కొమరం విశ్వనాధం, సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టి మల్ల ప్రవీణ్, సతీష్,దాసరి సాంబశివరావు, బాలయ్య,నాయకులు తదితరులు పాల్గొన్నారు.