మరో కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సాప్!
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అత్యధికంగా ఉపయోగిస్తున్న యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ఈ క్రమంలో తాజాగా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని సహాయంతో వినియోగదారులు సొంతంగా కస్టమ్ ఏఐ చాట్‌బాట్‌ను సృష్టించుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టర్ల కోసం విడుదల చేయగా, త్వరలోనే మిగతా నియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.చాట్‌బాట్ సిద్ధమయిన తర్వాత వినియోగదారులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుందని సమాచారం. తాజా ఫీచర్ త్వరలోనే వాట్సాప్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా దశలో ఉండగా, బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.