ముంపు మండలాలను ఏపీలో కలపడం రాజ్యాంగవిరుద్ధం
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ -3 ప్రకారం పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాన్ని సీమాంధ్రలో కలిపేసి కేంద్రం చేతులు దులుపుకుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపామని బీజేపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. కానీ గిరిజనుల గోడు పట్టించుకునే నాథుడే లేకుండా ఆ ప్రాంతవాసుల పరిస్థితి దీనంగా తయారు కావటానికి నాటి కాంగ్రెస్ సర్కారు పాపం ఎంతుందో, వీటిని ఆంధ్రలో కలిపేస్తూ నిర్ణయం తీసుకున్న బాజపా ప్రభుత్వానికీ అంతే పాపం లెక్కగట్టాలి. మా అనుమతి లేకుండా మమ్మల్ని ఇష్టంవచ్చినట్లు ఫుట్‌బాల్ ఆడుకోవద్దని గిరిజనం నెత్తీనోరూ బాదుకున్నా పట్టించుకునే నాధుడే లేకపోయాడు. ముంపు మండలాలను విలీనం చేస్తూ కేంద్రం బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో టీఆర్ఎస్, ఒరిస్సాకు చెందిన బీజేడీ పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. కానీ గిరిజన ప్రజల గోడు పట్టించుకోకుండా, టీయారెస్, బీజేడీల అభ్యంతరాలను లెక్కచేయకుండా కేంద్రం ముంపు మండలాలను విలీనం చేస్తూ చట్టం చేసింది. ముంపు మండలాలను ఆంధ్రలో కలపడం వెను రెండు కుఠ్రలు దాగున్నాయి. ఒకటి గోదావరి బేసిన్లో వాటాల విషయంలో కయ్యానికి కాలు దువ్వటానికి ఆంధ్ర సర్కారుకు వీలు కలుగుతుంది. మరోటి ముంపు బాదితులకు సరైన పరిహారం ఇవ్వకుండా కంటితుడుపు చర్యలతో మమ అనిపించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొచ్చు. పోలవరం ప్రస్థుత డిజైన్ మార్చాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేస్తూనే ఉంది. తద్వారా ముంపు ప్రాంతాన్ని తగ్గించటమే కాక నిర్వాసితల సంఖ్య గణనీయంగా తగ్గించొచ్చుక. కానీ డిజైన్ మార్చకుండా నిర్మాణం చేపట్టి, ఎలాగో విభజన చట్టంలో ముంపు ప్రాంతాన్ని ఆంధ్రలో కలుపుకునే వీలు కల్పించినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కలిసి బాజపా సర్కారుపై ఒత్తిడి తెచ్చి అభ్యంతరాలను పట్టించుకోకుండానే నిర్ణయం తీసుకున్నారు. మొత్తంమీద వివాదాస్పద ముంపుమండలాల విలీనం బిల్లు లోక్‌సభలో తీవ్రస్థాయి నిరసనల మధ్య ఆమోదం పొందింది. అయితే ఆది నుంచి స్థానికులు తమ గ్రామాల విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. కానీ సభా నిబంధనలకు అనుగుణంగా బిల్లుకు సవరణలు చేపట్టామని, సవరణలపై ప్రత్యేక చర్చకు వీలు ఉండదని, ఆర్డినెన్స్ రద్దుకు బిల్లును తీసుకువచ్చారని, దీనిపై రాద్ధాంతం అవసరం లేదని ఏకపక్షంగా స్పీకర్ అధికారపార్టీ నిర్ణయానికి మద్దతుగా రూలింగ్ ఇచ్చారు. నిజానికి ఒక రాష్ట్రంలోని భూభాగం మరొక రాష్ట్రంలో కలపాలంటే దానికి చట్టసవరణ తప్పనిసరి, అందునా భూభాగం వదులుకోవాల్సిన రా,ష్టం అందుకు తప్పనిసరిగా అంగీకారం తెలపాల్సి ఉంటుంది. జూన్ 2 నాటికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినందున టెక్నికల్‌గా పోలవరం ముంపు మండలాలు కావాలంటే తెలంగాణ రాష్ట్ర అనుమతి తప్పనిసరి. కానీ నిబంధనలకు విరుద్ధంగా, ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కుతూ ముంపు మండలాలను నిర్దాక్షిణ్యంగా ఆంద్రప్రదేశ్‌లో కలిపేశారు. అందుకే సభలో పునర్వ్యస్థీకరణ బిల్లుకు అనుసంధానంగా ముంపు మండలాల విలీన అంశాన్ని ఎలా తీసుకువస్తారని టిఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత బిల్లును తీసుకురావడం అన్యాయమని, రాజ్యాంగ వ్యతిరేకమని, ముంపు మండలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయని, అక్కడి ప్రజానీకానికి అనుగుణంగా టిఆర్ఎస్కు స్పష్టమైన వైఖరి ఉందని, ఆర్డినెన్సు తీసుకురావడానికి ముందు రాష్ట్రపతి ఏ దశలోనూ తెలంగాణ అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకోలేదని, అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని బిల్లును వాయిదా వేయాలని టిఆర్ఎస్ కోరింది. పోలవరం ప్రాజెక్టు పట్ల వ్యతిరేకత లేదని, అయితే ప్రాజెక్టు డిజైన్‌తోనే ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోందని, తమ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా డ్యాం ఎత్తు పెంచే ప్రతిపాదన ఉండటం వల్ల ఒడిషా, చత్తీస్‌ఘర్‌లో 307 ఆదివాసీ గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ బహుళార్థక ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించింది. ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించింది. ముంపు మండలాల వివాదం తో తెలంగాణ ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తమ ఆదివాసీ గ్రామాలు ముంపునకు గురవుతాయని ఒడిషా, చత్తీస్‌ఘర్ గ్రామాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయితే అభ్యంతరాలను తోసిపుచ్చిన స్పీకర్ మహాజన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చారు. ¬ం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిల్లును తీసుకురావచ్చునని రూలింగ్ ఇచ్చారు. అయితే టిఆర్ఎస్ సభ్యులు మంత్రిని అడ్డుకునేం దుకు యత్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లుకు సవరణలు ప్రతిపాదించారని, ఇందులో ఏకపక్షంగా తెలంగాణ గ్రామాల విలీన అంశాన్ని పొందుపర్చారని తెలంగాణ ఎంపీలు విమర్శించారు. సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టేందుకే ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చారని, సాంకేతిక కమిటీ ఆమోదం లేకుండా, సంబంధిత రాష్ట్రాలతో చర్చించకుండా ఆర్డినెన్స్ ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు. విపక్ష సభ్యుల డిమాండ్లను తిరస్కరించిన హోంమంత్రి రాజ్‌నాథ్ జాతీయహోదా కల్పించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తూ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు ముంపు మండలాలు తెలంగాణ నుంచి ఏపీకి బదలాయించాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నడూ ఆయా రాష్ట్రాల అంగీకారం లేకుండా భూభాగాన్ని పక్క రాష్ట్రాల్లో కలపలేదు. గతంలో రాజోలిబండ స్కీం కింద సాగు భూమి 90శాతంపైన తెలంగాణలో ఉన్నా కర్ణాటక భూభాగాన్ని తెలంగాణలో కలపలేదు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నా భాస్కర్ తెలంగాణ భూభాగాన్ని ఆంధ్రకు అప్పజెప్పింది. దీంతో ఆయా మండలాల ప్రజల ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి ఏపీ అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఇవ్వాలని కోరాల్సివచ్చింది. ఇన్ని సమస్యలున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడిభూభాగాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపే అధికారం కేంద్రానికి ఎట్ల సంక్రమించిందని బాదితులు, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అప్పటికైనా కేంద్రం ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచి బాదితులకు తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.