మురిసిన మువ్వన్నెల జెండా ఊరు వాడా ప్రతిఇంటా జాతీయ పతాక రెపరెపలు

హత్నూర (జనం సాక్షి)
వందల యేళ్ళుగా ఆంగ్లేయుల చెరలో బందీయైన భరత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు శనివారం హత్నూర మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.అంబేద్కర్ సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల నుండి మండల కేంద్రమైన హత్నూర వరకు‌ విద్యార్థులతో కలిసి నిర్వహించిన వజ్రోత్సవ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. జాతి పితా మహాత్మా గాంధీ,భరత మాత వేశాధరణతో చిన్నారులు ప్రత్యేకంగా అలరించి వారి దేశ భక్తిని చాటుకున్నారు.బిజెపి నాయకుల ఆధ్వర్యంలో సుమారు 5వందల జాతీయ జెండాలను ప్రజలకు పంపిణీ చేశారు.అదే గాకుండా గ్రామ గ్రామాన ప్రధాన వీధుల గుండా ప్రజలు పలు నినాదాలు చేస్తూ త్రివర్ణ పతాకాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఐకమత్యాన్ని చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానంగా నేటి యువత పెడదోవ పట్టకుండా మహనీయుల అడుగు జాడల్లో నడుస్తూ దేశ ప్రగతికి పాటు పడాలని ఆయన సూచించారు.కార్యక్రమంలో అసంఘటిత రంగ కార్మిక లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి,ఎంపీపీ నర్సింలు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,కార్యదర్శి వెంకటేశం గుప్తా, సర్పంచి వీరస్వామి గౌడ్,బుచ్చిరెడ్డి,నాగ ప్రభు గౌడ్, కిషోర్,అజ్మత్ అలీ,అజీజ్,నరెందర్ తదితరులు పాల్గొన్నారు.