రాచాలపల్లికి బస్సు సౌకర్యం కల్పించడం అభినందనీయం..

పూర్తిస్థాయిలో సహకరించ కంబాలపల్లి శ్రీనివాస్ రెడ్డి.
ఊరుకొండ, సెప్టెంబర్ 20 (జనంసాక్షి):
నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండల పరిధిలోని రాచాలపల్లి గ్రామానికి గత నెల రోజులుగా ఆర్టీసి బస్సులు బంద్ కావడంతో కల్వకుర్తిలో చదువుకునే పాఠశాల విద్యార్థులు, స్థానిక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు కంబాలపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్ వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో సహకారం అందించి, కల్వకుర్తి డిపో మేనేజర్ శ్రీకాంత్ మరియు ఆర్టీసీ కంట్రోలర్ శ్రీనివాసరావు తో మాట్లాడి రాచాలపల్లి గ్రామానికి బస్సు వేయించి బస్సు పునర్ ప్రారంభించారు. అదే బస్సులో విద్యార్థులతో, గ్రామస్తులతో పాటు వారు బస్సులో ప్రయాణించి విద్యార్థుల, గ్రామ ప్రజల కష్టాలు తీర్చారు. ఈ సందర్భంగా గ్రామానికి ఆర్టీసీ బస్సు రావడంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేవని, గ్రామం నుండి ఊరుకొండ, కల్వకుర్తి కి చేరుకోవడం సులభతరం అయిందని, బస్సు సౌకర్యం కోసం సహకరించిన వారికి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రయాణికులు, పరిసర గ్రామాల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.