రాజ్‌కుంద్రాపై సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ ,జూన్ 10 (జనంసాక్షి) :
ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్ , బెట్టింగ్ రాకెట్‌లో ఆరోపణలు ఎదుర్కొంటోన్న రాజస్థాన్ రాయ ల్స్ ఫ్రాంచైజీ కో ఓనర్ రాజ్‌కుంద్రాపై వేటు పడింది. ఇవాళ అత్యవసరంగా సమావ ేశమైన భారత క్రికెట్ కంట్రో ల్ బోర్డ్ ప్రధానంగా రాజ్‌కుంద్రాపైనే చర్చించింది. ఇటీవల పోలీసు విచారణలో కుంద్రా బెట్టింగ్‌కు పాల్పడినట్టు అంగీ కరించాడు. తన జట్టుపైనే భారీస్థా యిలో పందాలు కాసినట్టు ఒప్పుకు న్నాడు. ఈ విషయా న్ని ఢిల్లీ పోలీస్ కవిూషనర్ నీరజ్‌కుమార్ విూడియాకు చెప్పడంతో బీసిసి ఐకి షాక్ తగిలింది. దీంతో అప్పటి వరకూ ఫ్రాంచైజీ ఓనర్లకు సంబంధం లేదనుకున్న వివాదం మరో మలుపు తిరిగింది. తర్వాత రాజ్ కుంద్రా , అతని భార్య శిల్పాషెట్టి విూడియానే అవాస్తవ ప్రచారం చేస్తోందంటూ మండిప డినా ప్రయో జనం లేకపోయింది. బీసిసిఐ విూ టింగ్‌లో సభ్యులంద రూ విచారణ పూర్తయ్యే వరకూ రాజ్‌కుంద్రాను సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా కోరడంతో తాత్కాలిక ప్రెసిడెంట్ ఈ నిర్ణయం తీసుకు న్నారు. విచారణలో అతను దోషిగా తేలితే శిక్షించాలని , లేకుంటే మళ్ళీ తన స్థానంలోకి కుంద్రా తిరిగి రావొచ్చని బోర్డ్ తెలిపింది. బోర్డు సస్పెన్షన్ వేటు ప్రకారం అతను క్రికెట్ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొన కూడదు. ఫ్రాంచైజీ వ్యవ హారాలకు కూడా దూరంగా ఉండాలి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో రాజ్‌కుంద్రా , శిల్పాషెట్టి జోడీకి 11.7 శాతం వాటా ఉంది. ట్రెస్కో ఇంటర్‌నేషనల్ సురేష్ చెల్లారామ్‌కు 44.2 శాతం, ఎమర్జింగ్ విూడియా మనోజ్ బడాలేకు 32.4 శాతం, బ్లూ వాటర్ ఎస్టేట్‌కు 11.7 శాతం వాటాలు ఉన్నాయి. అయితే రాజ్‌కుంద్రా తప్పు చేసినట్టు ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినా… విచారణ పూర్తయ్యే వరకూ వేటు వేస్తే మంచిదన్న అభిప్రాయం బోర్డు వర్గాల్లో వ్యక్తమవడంతో సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. అటు ఫ్రాంచైజీ మాత్రం రాజ్‌కుంద్రాకు సపోర్ట్‌గా నిలిచింది. ఒకవేళ అతను తప్పు చేసినట్టు తేలితే మాత్రం తన పేరిట ఉన్న 11.7 శాతం వాటాను జప్తు చేస్తామని కూడా ప్రకటించింది. ప్రస్తుతం విచారణ కొనసాగు తున్నందున రాజస్థాన్ టీమ్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం ఆరోపణలు వచ్చిన కుంద్రాపైనే వేటు వేసింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీ ఓనర్లు క్రీడాస్ఫూర్తి విరుధ్దంగా ఎటువంటి అవినీతికి పాల్పడినా… ప్రోత్సహించినా ఆ జట్టును రద్దు చేసే అధికారం బోర్డుకు ఉంటుంది. కాగా రాజ్‌కుంద్రా మధ్ధతుదారులు మాత్రం బోర్డ్ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రతినిధి గురునాథ్‌పై కూడా ఆరోపణలు ఉన్నా బీసిసిఐ ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.