రేపటినుంచి ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రారంభం
హైదరాబాద్: ఎంసెట్ అడ్మిషన్ల చివరి విడత కౌన్సెలింగ్ రేపటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు చివరి విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. చివరివిడత కౌన్సెలింగ్‌కు హాజరయిన అభ్యర్థులకు అక్టోబరు 2 సాయంత్రం ఆరుగంటలకు సీట్లను కేటాయిస్తారు. మొదటివిడత సీట్లు దక్కించుకున్న లక్ష 36 వేల మందిలో నేటి సాయంత్రం వరకు లక్ష 15 వేల మంది మాత్రమే కళాశాలల్లో రిపోర్టు చేశారు.



