రేషన్ కార్డుకు మార్గదర్శకాలు జారీ
` గ్రామీణప్రాంతాల్లో వార్షికాదాయం రూ.లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు ప్రామాణికం
` పట్టణప్రాంతాల్లో రూ. 2లక్షలుగా నిర్దారణ
` సక్సేనా కమిటీ సిఫారసుల మేరకే అర్హత ప్రమాణాలు
` ప్రజాప్రతినిధుల అభిప్రాయాలూ పరిగణలోకి..
` మంత్రివర్గ ఉపసంఘం భేటిలో నిర్ణయం
` విధివిధానాలపై కసరత్తు
` వివరాలు వెల్లడిరచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): ఏళ్లుగా తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల జారీ పక్రియను వేగవంతం చేసింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఇదే అంశంపై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ఇతర మంత్రులు, సంబంధిత శాఖా అధికారులు హాజరయ్యారు. రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు కొత్త రేషన్ కార్డుల మంజూరీపై సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీకి చైర్మన్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ హాజరయ్యారు.తెల్లరేషన్ కార్డుల పంపిణీకి విధివిధానాలపై మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రావిూణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు ప్రామాణికంగా తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలుగా నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో భూములను కాకుండా వార్షిక ఆదాయాన్ని ఆధారంగా రేషన్ కార్డు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీలో లబ్దిదారుల ఎంపికకు విధి విధానాల రూపకల్పనలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. వాందరికీ సమాచారం చేరేలా లేఖలు రాయాలని అధికారులను ఆదేశించింది మంత్రివర్గ ఉపసంఘం. తెల్ల రేషన్ కార్డుల జారీ కోసం సక్సేనా కమిటీ సిఫారసుల పరిశీలించడం, దేశంలోని మిగిలిన రాష్టాల్ల్రో తెల్ల రేషన్ కార్డుల అర్హత ప్రమాణాలను పరిశీలించాలను అధికారులను మంత్రులు ఆదేశించారు. ఇతర రాష్టాల్ల్రో తెల్ల రేషన్ కార్డు ఉండి తెలంగాణలోనూ వైట్ రేషన్ కార్డు ఉంటే తీసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రావిూణ ప్రాంతాల్లో రూ.లక్ష వార్షిక ఆదాయం లేదా మాగాణి 3.50 ఎకరాలు, లేదా చెలక 7.5 ఎకరాల లోపు భూమి ఉన్నవారినే ఎంపిక చేయాలని ప్రతిపాదించారు. పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల గరిష్ట వార్షికాదాయం ఉన్న వారినే అర్హులుగా నిర్ణయించాలని సూచించారు. అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేఖలు రాసి సూచనలు తీసుకోవాలని నిర్ణయించింది. రెండు రాష్టాల్లో రేషన్ కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని ప్రతిపాదించింది. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. సక్సేనా కమిటీ సిఫారసులను రేషన్ కార్డుల మంజూరుకు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులుండగా.. పెండిరగులో 10 లక్షల దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు.