పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించేందుకు ఏపీ కుట్ర

` పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం
` బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పుకు విరుద్ధంగా జలాలు తరలించే యత్నమని వెల్లడి
న్యూఢల్లీి(జనంసాక్షి):పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే యత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పుకు విరుద్ధంగా జలాలు తరలించే యత్నమని పిటిషన్‌లో తెలిపారు. ప్రాజెక్టుపై తదుపరి ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
అసలేం జరిగిందంటే.. ఏపీ చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్‌ లింక్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించుంది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు సంబంధించిన ఆధారాలను సిద్ధం చేసుకుంది. ఇంతకు ముందు పోలవరం-బనకచర్ల లింక్‌? ప్రాజెక్టుకు ఏపీ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు రూపొందించి కేంద్ర జలశక్తిశాఖకు పంపించింది. దీనిపై కృష్ణా, గోదావరి బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరం తెలిపాయి. అలాగే పలు గోదావరి పరీవాహక రాష్ట్రాలు కూడా అనేక సందేహాలను లేవనెత్తాయి.ఈ పోలవరం-నల్లమల సాగర్‌ లింక్‌ ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రిని, సీడబ్ల్యూసీని కూడా కలిసి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. మరోవైపు ఏపీ ఈ లింక్‌ ప్రాజెక్టు డీపీఆర్‌కు టెండర్లు పిలిచిన విషయం విదితమే. చివరికి ఈ లింక్‌ టెండర్లను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. పీబీ లింక్‌ ప్రాజెక్టులో మార్పు చేసి బనకచర్ల బదులు నల్లమలసాగర్‌?కు నీటిని తరలించేందుకు కొత్త లింక్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ఈ లింక్‌లో భాగంగా గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీలను బొల్లాపల్లి రిజర్వాయర్‌? ద్వారా నల్లమల సాగర్‌?కు తరలించనుంది. తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం, ట్రైబ్యునల్‌అవార్డులు ఇతర నిబంధనలన్నింటినీ ఉల్లంఘిస్తూ, తెలంగాణ అభ్యంతరాలను ఖాతరు చేయకుండా ఏపీ ఈ లింక్‌? ప్రాజెక్టు చేపడుతోందని అని ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరేదారీ లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కేసు దాఖలు, ఆధారాలు తదితర పరిణామాలపై శనివారం దిల్లీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి న్యాయనిపుణులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న అభిషేక్‌ సింఫ్వీుతో సమావేశమయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టుపై తెలంగాణ పిటిషన్‌దాఖలు చేసింది. పోలవరం – నల్లమలసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.58 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. మొదట్లో భావించిన మూడు సెగ్మెంట్లలోనే పనులు చేయనున్నారు. మూడో సెగ్మెంట్‌?లో గతంలో అనుకున్నట్లు బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచర్ల వరకు కాకుండా బొల్లాపల్లి నుంచి నల్లమలసాగర్‌ జలాశయం వరకే అది పరిమితం కానుంది. ఇందుకు రూ.9 వేల కోట్లు ఖర్చు అవుతాయని లెక్క… మొదటి, రెండు సెగ్మెంట్లలో ఎలాంటి మార్పు లేదు. తొలి సెగ్మెంట్‌కు (పోలవరం-ప్రకాశం బ్యారేజి) రూ.13 వేల కోట్లు ఖర్చు, రెండో సెగ్మెంట్‌కు (ప్రకాశం బ్యారేజి-బొల్లాపల్లి)లో బొల్లాపల్లి రిజర్వాయర్‌ నిర్మించి అక్కడికి పోలవరం నీటిని తరలిస్తారు. దీనికి రూ.36 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఈ ప్రాజెక్టుపై ఆశ్రయించడంపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియాలి. బొల్లాపల్లి జలాశయానికి నీళ్లు తీసుకెళ్లి అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమలసాగర్‌ జలాశయానికి గోదావరి నీళ్లు తరలించాలనేది కొత్త ప్రణాళిక. అవసరమైతే ఈ జలాలను సోమశిలకూ మళ్లిస్తారు. ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం సీరియస్‌?గా తీసుకుంది. మరి సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాల్సిందే.