నేడు పంచాయతీ తుది తీర్పు

` మూడో విడతకు సర్వం సిద్ధం..
` 3,752 పంచాయతీల్లో పోలింగ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. మూడో విడతలో మొత్తం 4,159 సర్పంచి స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో 394 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 3,752 సర్పంచి స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 36,425 వార్డులకుగాను 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 28,410 వార్డులకు 75,725 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. 11 సర్పంచి స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేశారు.