రైతులకు అండగా కెసిఆర్ ప్రభుత్వం
కొత్తగూడెం,జనం సాక్షి ): ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు ఎరువులు, విత్తనాలను ఏడాదికి రెండు పంటలకు సరిపడా పెట్టుబడి అందించాలని నిర్ణయించిన మొదటి ప్రభుత్వంగా చరిత్రలో నిలవబోతుందని ఎమ్మెల్యే జలగం ప్రసాదరావు అన్నారు. రైతు సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం యంత్రీకరణ పథకం కింద ట్రాక్టర్లను ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీపై, ఇతర రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయానికి ఉపయోగపడే
విధంగా వాహనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. అన్నివర్గాల రైతులకు ఎకరానికి ప్రతీ సీజన్‌కు రూ.4000చొప్పున విత్తనాలు, ఎరువులకు పెట్టుబడి అందించాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని రైతులంతా హర్షిస్తూ టీఆర్‌ఎస్ పాలనను దీవిస్తున్నారని అన్నారు.
—-