*రోడ్డు పనులలో నాణ్యత పాటించాలి ఎంపీపీ జ్యోతి భిక్షం.*
నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.మండలంలో జరిగే రోడ్డు పనులలో క్వాలిటీ పాటించాలని నేరేడుచర్ల ఎంపీపీ జ్యోతి బిక్షం అన్నారు.సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ఎంపీడీవో ఆఫీసులో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ జ్యోతి బిక్షం అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిల్లేపల్లి నుండి సోమవారం వరకు జరిగే రోడ్డు పనులు పూర్తికాకముందే రోడ్డులో గుంతలు పడుతున్నాయని,రోడ్డు పనులలో క్వాలిటీ పాటించాలని అధికారులను సూచించారు. సోమవారం మరియు మేడారం పాఠశాలలకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని,మండలంలో కొన్ని సిసి రోడ్ల పనులు నెలలు గడుస్తున్నా పూర్తి కావడం లేదని వాటిని పూర్తి చేయాలని జెడ్పిటిసి రాపోలు నరసయ్య అధికారులను కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల తరువాత పాఠశాలలు ఈ సంవత్సరం మంచిగా నడుస్తున్నాయని ఎంఈఓ చత్రు నాయక్ అన్నారు.తన 19 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో పుస్తకాలు స్టూడెంట్స్ కి ఆరుసార్లు వచ్చాయని,ఇలా జరగటం ఇదే మొదటిసారి అని ఈ విషయంలో విద్యార్థులు కొద్దిగా ఇబ్బంది పడ్డట్టు తెలిపారు. మిషన్ భగీరథ నీరు ప్రచారాలకు, పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆ నీరు ప్రజలకు చేరడం లేదని కొందరు సర్పంచులు ఆరోపించారు. మండలంలో మైనింగ్ పర్మిషన్ లేకుండా మట్టితోవ్వకాలు జరిపితే వారిపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తాహసిల్దార్ స్రవంతి అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో శంకరయ్య,
వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, మండల అధికారులు,ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area