లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
మల్లాపూర్ (జనంసాక్షి) ఆగస్టు:10 మల్లాపూర్ మండల కేంద్రంలోని గత 45 సంవత్సరాలుగా సేవలందిస్తున్న పోస్ట్మార్టం పంచతి మల్లయ్య కు వీడ్కోలు సన్మానాన్ని క్లబ్ అధ్యక్షులు డాక్టర్ స్వామి బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాసిల్దార్ రవీందర్ మాట్లాడుతూ గత 45 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు యువకులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని అన్నారు. అనంతరం కొండలాద్రి మరియు ఇతరులు ఆయనకు శాలువా కప్పి మెమొంటో అందజేసి స్వీట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాట్పల్లి సరోజ, ఎంపీడీవో రాజ శ్రీనివాస్ ఎంపీటీసీ ఆకుతోట రాజేష్, ఎం పి ఓ జగదీశ్వర్ రెడ్డి, వార్డు సభ్యులు బిక్షపతి నాగరాజు దామెర నరసయ్య, సత్తార్ రఫీ పెద్దిరెడ్డి లక్ష్మీనరసయ్య సోమ అశ్విన్ కుమార్ నల్ల శేఖర్ రెడ్డి లక్ష్మీనారాయణ భీమేష్ కొండలద్రి అంగన్వాడి ఉపాధ్యాయురాలు ఇందిరా గంగాభవాని వసంతలు భూమేష్ తదితరులు పాల్గొన్నారు