వరద బాధితులను ఆదుకుంటాం

` పెద్దవాగును పరిశీలించిన మంత్రి తుమ్మల
` అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
హైదరాబాద్‌(జనంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు కొట్టుకుపోవ డంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదవాగు ప్రాజెక్ట్‌ను ఆయన పరిశీలించారు. నీట మునిగిన ఇండ్లను పరిశీలించి బాధితులకు తక్షణం సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులను ఆదుకంటామని హావిూనిచ్చారు. కాగా,పెదవాగు కొట్టుకుపోవడంపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్షా కాలానికి ముందు పెదవాగు ప్రాజెక్టు స్థితిగతులు ఏంటి అనే వివరాలను తనిఖీలు చేశారా? పెదవాగుకు సంబంధించిన సమగ్ర వివరాలు, ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకోవడానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశిం చింది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నలుగురికి మెమోలు జారీ చేసింది.పెదవాగు ప్రాజెక్టు పరిధిలో 30 మంది పనిచేయాల్సి ఉండగా.. కేవలం 10 మంది మాత్రమే పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం వహించిన ఈఈ సురేశ్‌కుమార్‌, డీఈఈ కృష్ణ, ఏఈఈ కృష్ణతో పాటు మరో అధికారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ సెక్రటరీకి భద్రాద్రి జిల్లా చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే.