*విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎస్సార్ ప్రైమ్ ప్రిన్సిపాల్ మునీర్*

కోదాడ సెప్టెంబర్ 25(జనం సాక్షి)
 తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన బతుకమ్మ పండుగను విద్యార్థి దశనుండే పిల్లలకు నేర్పాలని పాఠశాల ప్రిన్సిపాల్ మునీర్ అన్నారు.శనివారం కోదాడలోని ఎస్ ఆర్ ప్రైమ్ స్కూల్లో బతుకమ్మ పండుగను  పురస్కరించుకొని ఘనంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ  కీర్తిని చాటాలని ఆయన అన్నారు. విద్యార్థులు విద్యతోపాటు  సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలని ఆయన అన్నారు.తెలంగాణలో పువ్వులనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణదని  ఆయన తెలిపారు. విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల పాఠశాల ఏవో సుల్తాని ఉపేందర్ క్యాంపస్ ఇంచార్జ్ బెజవాడ వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అహ్మద్ ఉన్నిస,సైదయ్య,లక్ష్మణ్,శ్రీనివాస్,లక్ష్మి,స్వరూప,విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.