విద్యావంతులైన పౌరులు రాజకీయంలోకి రావాలి, BSP ఇంచార్జ్ నక్క విజయ్ కుమార్..
ధర్మపురి (జనం సాక్షి ) మండల కేంద్రం తెనుగు వాడ
ఆగస్టు 15 రోజున బహుజన్ సమాజ్ పార్టీ జట్టి శ్రీనివాస్ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్ నక్క విజయకుమార్ మాట్లాడుతూ దేశం సురక్షితంగా సస్యశ్యామలంగా ఉండాలి అంటే విద్యావంతులైన యువకులు రాజకీయంలోకి రావాలి రాజ్యాంగంపై అవగాహన దేశ ప్రజలపై అంకితభావం ఉన్న వ్యక్తులు చట్టసభల్లోకి వెళితే దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని ఆయన అన్నారు అదేవిధంగా విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు విద్యార్థి దశ నుండే దేశభక్తిని పెంపొందించే విధంగా విద్యార్థులను తయారు చేయాలని కోరారు అంతే కాకుండా దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన ప్రతి ఒక్క అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఆగస్టు 15 రాగానే జెండా ఎగురవేయడం మరుసటి రోజు మర్చిపోయి యధావిధిగా బాధ్యతారహితంగా ఉండడం సరికాదని దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి మనిషి పై దేశాన్ని రాష్ట్రాలను కాపాడుకుని బాధ్యత ఉందని వారి వారి రంగంలో వారు తన వంతు కృషి చేసి దేశాభివృద్ధికి పాల్పడితే అతిపెద్ద డెమోక్రసీ కంట్రీ ఇంతవరకు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి పౌరుడు సైనికుల పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు కుషన పెళ్లి శ్రీనివాస్ గొల్లపల్లి మండల అధ్యక్షుడు కల్లేపల్లి తిరుపతి, ఎండపల్లి మండల అధ్యక్షుడు తడగొండ కార్తీక్, శైలేందర్, శ్యామల శ్రీకాంత్, నరేష్ ,అజయ్,అంజి, నవీన్ స్వే రో స్టూడెంట్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ బెజ్జంకి అజయ్,
తుమ్మ భరత్, కార్పాకుల రాహుల్, నారవేణి నవీన్, తుమ్మ అరవింద్, ఉత్తం అభిషేక్ పోలవేణి నాగరాజ్ , కొండవేని నాగేష్, ఇనుగుర్తి సాయి తేజ, ఎస్.కె అజీమ్, అంబటి పెళ్లి పూర్ణ చందు, ఆలకుంట శేఖర్, యార్వ మన చైర్మన్ నారవేణి రాజు బట్ట పెళ్లి లచ్చన్న, తాటి పెళ్లి భూమన్న, కొండవేని వంశీ, ప్రణీత్, మనోజ్, మహేష్, శివరాత్రి, తిరుపతి, గాడ్చర్ల శేఖర్, రేగుల రాజేష్, జంగ రాజేష్, బోడ సురేష్, అయ్యోరి శివ, సొప్పరి అక్షయ్, సాంబరాజు, చొప్పరి రాజన్న తదితరులు పాల్గొన్నారు.