విద్యుత్ సమస్యలు పరిష్కరించండి
విజయనగరం జూన్ 30 : మండలంలోని బంగారమ్మ పేటలో నిత్యం విద్యుత్ కోతలు అమలు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. పగటి పూట విద్యుత్ సరఫరా ఉండకపోయినా సమస్య లేదని, రాత్రి సమయంలో విద్యుత్ కోతతో నిద్రకు కరువు అయ్యామని వారు ఆవేదనర వ్యక్తం చేశారు. వేళాపాళాలేని విద్యుత్ కోత వల్ల దోమలు వృద్ధి చెంది, మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించి సరఫరా మెరుగుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.